
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజాలు ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్(పీజీసీఐఎల్) సంయుక్తంగా ప్రభుత్వానికి రూ. 2,593 కోట్ల డివిడెండ్‌ను అందించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22)గాను ఎన్‌టీపీసీ రూ. 1,560 కోట్లు, పీజీసీఐఎల్ రూ. 1,033 కోట్లు చొప్పున ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా పేర్కొన్నారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ పీఎస్‌యూల నుంచి డివిడెండ్ల రూపేణా ప్రభుత్వానికి రూ. 7,515 కోట్లు అందినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో మరోపక్క ప్రభుత్వ రంగ కంపెనీలలో మైనారిటీ వాటాల డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 9,110 కోట్లు సమకూర్చుకున్నుట్లు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment