సాక్షి, న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్‌కో)లో వాటాలను మరో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌టీపీసీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. ఈ డీల్ ద్వారా ఖజానాకు దాదాపు రూ. 10,000 కోట్లు రావొచ్చని అంచనా. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ. 65,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు ఇది తోడ్పడగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది మార్చి 31 నాటికి నీప్‌కో నికర విలువ రూ. 6,301 కోట్లుగా ఉంది. అటు టీహెచ్‌డీసీఐఎల్ విలువ రూ. 9,281 కోట్లుగా ఉంది. కేంద్రానికి టీహెచ్‌డీసీఐఎల్‌లో 74.23 శాతం, నీప్‌కోలో 100 శాతం వాటాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment