కోటి మొక్కలతో ఎన్టీపీసీ హరితహారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీ ఎన్‌టీపీసీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని నిశ్చయించింది. మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అటవీ శాఖలతో కలిసి 2016-17లో కోటి మొక్కలను నాటుతామని కంపెనీ తెలి పింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల అటవీ శాఖలతో ఎంఓయూలను కుదుర్చుకున్నామని పేర్కొంది. మిగతా వాటితోనూ త్వరలో ఎంఓయూలను కుదుర్చుకుంటామని తెలిపింది.