crore plants
-
కోటి మొక్కలు నాటేందుకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు, హరితహారంలో నాణ్యమైన మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించి నిర్ణీత వ్యవధిలోగా నివేదికను అందజేసేందుకు కమిషనర్ ఎం.దానకిశోర్ సర్కిల్, జోనల్ స్థాయిల్లో రెండు కమిటీలను వేశారు. సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్, యూబీడీ విభాగం మేనేజర్, రవాణ విభాగం ఏఈలు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్, యూబీడీ విభాగం డిప్యూటీ డైరెక్టర్, సిటీప్లానర్లు సభ్యులుగా ఉన్నారు. సర్కిల్ స్థాయి కమిటీ తమ పరిధిలోని అన్ని నర్సరీల్లో వారం రోజుల్లో తనిఖీలు చేసి నివేదికను అందజేయాలి. జోనల్ స్థాయి కమిటీ వారంలో రెండు పెద్ద నర్సరీలను పరిశీలించి అక్కడ పెంచుతున్న మొక్కల సంఖ్య, నాణ్యత తదితరమైన వాటి గురించి నివేదిక అందజేయాలి. ఇవికాక ప్రభుత్వ నర్సరీల్లో రెండు పెద్ద నర్సరీలతో పాటు జోన్‌లోని అన్ని ప్రైవేట్ నర్సరీలను తనిఖీ చేయాలి. యూబీడీ విభాగం అడిషనల్ కమిషనర్, యూబీడీ పనుల పర్యవేక్షణ అడిషనల్ కమిషనర్ రెండు నర్సరీలను సందర్శించాలి. అందరి నివేదికలు ఈనెల 21లోగా అందజేయాలి. ఈ కమిటీలన్నీ మే చివరి వారంలో, జూన్ రెండో వారంలో కూడా నర్సరీలను పరిశీలించి నిర్ణీత ఫ్రొఫార్మాలో నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. మొక్కలు నాటే ప్రదేశాలివే.. ఝసర్కిల్ కమిటీలు మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించడంతో పాటు డిప్యూటీ కమిషనర్లు రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీఓలు, విద్యా సంస్థలతోనూ సమావేశాలు నిర్వహించి వారి సమన్వయంతో తగిన ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ గురించి కూడా సమావేశాల్లో ప్రచారం నిర్వహించాలి. మొక్కలు నాటేందుకు ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు, నాలా వెంబడి ప్రాంతాలు తదితర వాటిని గుర్తించాలి. ఎక్కడ ఎన్ని మొక్కలు నాటవచ్చో అంచనా వేయాలి. వీటితో పాటు జీహెచ్ఎంసీకి చెందిన ఓపెన్ స్పేస్, చెరువులు, డబుల్బెడ్రూమ్ ఇళ్లు తదితర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని కమిషనర్ దానకిశోర్ సంబంధిత అధికారులకు సర్క్యులర్జారీ చేశారు. -
కోటి మొక్కలతో ఎన్టీపీసీ హరితహారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీ ఎన్టీపీసీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని నిశ్చయించింది. మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర అటవీ శాఖలతో కలిసి 2016-17లో కోటి మొక్కలను నాటుతామని కంపెనీ తెలి పింది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల అటవీ శాఖలతో ఎంఓయూలను కుదుర్చుకున్నామని పేర్కొంది. మిగతా వాటితోనూ త్వరలో ఎంఓయూలను కుదుర్చుకుంటామని తెలిపింది. -
మొక్కలు సరే.. సంరక్షణే సమస్య
హరితహారం.. లక్షల వ్యయం గార్డులకు మాత్రం నిధుల కొరత సుమారు కోటి మొక్కలకు రక్షణ కరువు విరాళాలిచ్చేందుకు పలువురు ముందుకు.. అందరూ భాగస్వాములైతేనే నెరవేరనున్న లక్ష్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంలా చేపట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్నా పెద్ద తేడా లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఇందులో భాగస్వాములవుతున్నారు. మొక్కల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు లక్షల్లో నిధులు కేటాయించింది. అయితే నాటిన మొక్కల సంరక్షణ విషయంలో సరిపడా నిధులు కేటాయించకపోవడం సమస్యగా మారింది. ఎలాంటి రక్షణ లేని మొక్కలు పశువులకు ఆహరంగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్దేశిత లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరకపోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. - జమ్మికుంట నాలుగు కోట్ల మొక్కల్లో.. కోటికి పైగా రక్షణ కరువు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం లో కనీసం 40 వేల మొక్కలు నాటేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు నర్సరీల్లో దాదాపు నాలుగు కోట్ల మొక్కలను గ్రామాల వారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొం దించారు. ఈ నెల 8 నుంచి రెండో విడత హరతహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నాలుగు కోట్ల మొక్కల్లో దాదాపు సగం వరకు ట్రీగార్డుల సమస్య నెలకొంది. వీటిని ఏర్పాటు చేస్తే తప్ప మొక్కలు బతికే పరిస్థితి లేదు. లేకుం టే రోడ్ల వెంట, చెరువు, కాలువ గ ట్లపై, వనాల్లో నాటిన మొక్కలు పశువుల పాలు కాకత ప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంరక్షణకు రూ.150 కోట్లు జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా అధికార యంత్రంగం అడుగులు వేస్తుండగా ఇందులో సుమారు కోటి మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోదానికి రూ.150 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన కొనుగోలు చేసినా కోటి మొక్కలకు సుమారు రూ.150 కోట్లు అవసరం కానున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సర్కారు కేటాయించే పరిస్థితి లేక పోవడంతో దాతలపై భారం పడనుంది. ట్రీగార్డుల కోసం విరాళాల ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్పా కోట్లాది మొక్కలను సంరక్షించలేని పరిస్థితి. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షణ కోసం ముందుకు వస్తున్న దాతలు - జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలు సంరక్షణ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార వర్గాలు ట్రీగార్డులను ఉచితంగా అందించేందుకు ముందుకు వస్తున్నారు. - తనవంతు సహకారంగా మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జేసీ శ్రీదేవసేన ఇటీవల ప్రకటించారు. అలాగే పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. - జమ్మికుంట పట్టణానికి చెందిన కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దోనకొండ మల్లారెడ్డి మొక్కల సంరక్షణ కోసం రూ.లక్షను మంత్రి ఈటల రాజేందర్‌కు శనివారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ తాను రూ.లక్ష విరాళంగా ఇస్తానని ప్రకటించారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి పాలకవర్గం నెల వేతనం ట్రీగార్డుల కోసం విరాళంగా ఇస్తామని వెల్లడించారు. -ఇటీవల కథలాపూర్ మండలం పోసానిపేటలో స్నేహాయూత్ సభ్యులు 120 ట్రీగార్డులు కొను గోలు చేసి మొక్కలకు ఏర్పాటు చేశారు. - కోల్‌సిటీ : హరితహారం కార్యక్రమానికి ఆర్థికసాయం అందించేందుకు రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఒక నెల తమ గౌరవ వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ డి.జాన్ శ్యాంసన్‌తోపాటు నగరపాలక సంస్థ అధికారులు, అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కూడా తమ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంపై మేయర్ అభినందించారు. -
తొలిరోజు నాటిన మొక్కలు కోటికి పైనే!
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలంగాణకు హరితహారం’ సందర్భంగా తొలిరోజు నాటిన మొక్కల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కోటీ ఆరు లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 25,44,685 మొక్కలు నాటగా, 20 లక్షలకు పైగా మొక్కలతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరితహారాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లాలో అటవీశాఖ ద్వారా 87 వేల మొక్కలు నాటినట్లు చూపగా, ఇతర శాఖలు నాటిన మొక్కల వివరాలు లేవు. అయితే 2,75,000 మొక్కలు నాటినట్లు ఈ జిల్లా అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా తొలిరోజు (8వ తేదీ) నాటిన మొక్కల వివరాలు జిల్లా అటవీశాఖ నాటినవి ఇతర విభాగాలు మొత్తం ఆదిలాబాద్ 1,29,000 19,36,962 20,65,962 నిజామాబాద్ 7,25,095 18,19,590 25,44,685 మెదక్ 2,45,000 7,39,000 9,84,000 రంగారెడ్డి 0 7,58,000 7,58,000 నల్లగొండ 87,000 - 87,000 మహబూబ్‌నగర్ 27,000 5,56,770 5,83,770 వరంగల్ 3,96,874 9,50,000 13,46,874 ఖమ్మం 7,60,000 6,64,700 14,24,700 కరీంనగర్ 1,75,618 6,28,975 8,04,593 హెచ్ఎండీఏ 28,700 మొత్తం 25,45,587 80,53,997 1,06,28,284