తొలిరోజు నాటిన మొక్కలు కోటికి పైనే! | More than crore plants are planted in one day | Sakshi
Sakshi News home page

తొలిరోజు నాటిన మొక్కలు కోటికి పైనే!

Published Sun, Jul 10 2016 2:37 AM | Last Updated on Tue, Sep 18 2018 6:32 PM

More than crore plants are planted in one day

సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలంగాణకు హరితహారం’ సందర్భంగా తొలిరోజు నాటిన మొక్కల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ మినహా 9 జిల్లాల్లో కోటీ ఆరు లక్షల మొక్కలు నాటినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 25,44,685 మొక్కలు నాటగా, 20 లక్షలకు పైగా మొక్కలతో ఆదిలాబాద్ రెండో స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హరితహారాన్ని ప్రారంభించిన నల్లగొండ జిల్లాలో అటవీశాఖ ద్వారా 87 వేల మొక్కలు నాటినట్లు చూపగా, ఇతర శాఖలు నాటిన మొక్కల వివరాలు లేవు. అయితే  2,75,000 మొక్కలు నాటినట్లు ఈ జిల్లా అధికార వర్గాలు తెలిపాయి.
 
జిల్లాల వారీగా తొలిరోజు (8వ తేదీ) నాటిన మొక్కల వివరాలు
జిల్లా  అటవీశాఖ నాటినవి  ఇతర విభాగాలు  మొత్తం
 ఆదిలాబాద్    1,29,000    19,36,962    20,65,962
 నిజామాబాద్    7,25,095    18,19,590    25,44,685
 మెదక్    2,45,000    7,39,000    9,84,000
 రంగారెడ్డి    0    7,58,000    7,58,000
 నల్లగొండ    87,000    -    87,000
 మహబూబ్‌నగర్    27,000    5,56,770    5,83,770
 వరంగల్    3,96,874    9,50,000    13,46,874
 ఖమ్మం    7,60,000    6,64,700    14,24,700
 కరీంనగర్    1,75,618    6,28,975    8,04,593
 హెచ్‌ఎండీఏ            28,700
 మొత్తం    25,45,587    80,53,997    1,06,28,284

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement