మొక్కలు నాటిన చేవెళ్ల డీఎస్పీ | Chevella dsp planted plants | Sakshi
Sakshi News home page

మొక్కలు నాటిన చేవెళ్ల డీఎస్పీ

Published Sun, Jul 17 2016 5:57 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

మొక్కలు నాటిన చేవెళ్ల డీఎస్పీ - Sakshi

మొక్కలు నాటిన చేవెళ్ల డీఎస్పీ

చేవెళ్లః చేవెళ్ల గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన కేసారం గ్రామంలో ఆదివారం చేవెళ్ల సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారి శృతకీర్తి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ...మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటేనే విజయవంతమవుతుందన్నారు. గ్రామాలలోని ఖాళీ, నిరుపయోగ స్థలాలలో విరివిగా మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, సీఐ జే.ఉపేందర్, ఎస్‌ఐ భీంకుమార్, ఏఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి, సిబ్బంది భీంరావు, ఉపసర్పంచ్‌ రాజిరెడ్డి, యువజనసంఘాల ప్రతినిధులు రాము, రాకేష్, శ్రీనివాస్, సుధాకర్, తదితరులున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement