సమావేశంలో మాట్లాడుతున్న సీహెచ్ ఉపేందర్
- హెచ్‌ఎంఎస్ ప్రధానకార్యదర్శి సీహెచ్.ఉపేందర్
- ఐక్యఫ్రంట్ విజయానికి సహకరించాలని వినతి
- 6న హోంమంత్రి నాయిని ప్రచారం
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగుల సమస్యల సాధనే ధ్యేయంగా ఎన్నికలలో ఐక్య ఫ్రంట్ పేరుతో యూనియన్లను కలుపుకుని విజయం దిశగా ముందుకుసాగుతున్నామని ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్‌ఎంఎస్) ప్రధాన కార్యదర్శి సీహెచ్.ఉపేందర్ అన్నారు. పీటీఎస్‌లో ఐక్యఫ్రంట్ కూటమి శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఐఎన్‌టీయూసీ యూనియన్ కాంట్రాక్టు కంపెనీగా మారిందన్నారు. సమస్యలను సాధించకుండా ఉన్న హక్కులను పోగొట్టిన ఘనత ఆ యూనియన్‌కే దక్కిందని పేర్కొన్నారు. ఈనెల 13న ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో ఐక్యఫ్రంట్‌ను గెలిపించాలని కోరారు. సీఐటీయూ జాతీయ నాయకులు, ఎన్బీసీ సభ్యుడు దేవరాయ్ నేతృత్వంలో ఉద్యోగులకు మెరుగైన వేతన ఒప్పందం కుదరడానికి ఐక్యఫ్రంట్ కృషి చేస్తుందని తెలిపారు. ఐక్యఫ్రంట్ ఎన్నికల గుర్తు స్కూటర్‌పై ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈనెల 6న తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి రామగుండంలో ప్రచారం చేస్తారని తెలిపారు. బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు మానకుంటే ఉద్యోగులే వారికి గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో సీఐటీయూ అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కనకరాజు, మాధవరావు, హెచ్‌ఎంఎస్‌కు చెందిన గోపాల్, రాంరెడ్డి, హన్మంతరావు, మొగురం గట్టయ్య, గోపాల్‌రెడ్డి, తిరుపతి, సత్యనారాయణగౌడ్, సాగికిషన్‌రావు, కంది రాజేశం, చంద్రయ్య, రవికుమార్, రమేష్, శామ్యూల్ జిప్స్ తదితరులు పాల్గొన్నారు.