
ఎన్‌టీపీసీలో 94 పోస్టులు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దేశంలోని అతి పెద్ద విద్యుదుత్పత్తి సంస్థ కావడంతోపాటు మహారత్న హోదా కూడా కలిగిన ఎన్‌టీపీసీలో కొలువంటే ఉజ్వల కెరీర్‌కు కేరాఫ్ అని చెప్పొచ్చు.
మొత్తం ఖాళీలు: 94
పోస్టుల వారీగా ఖాళీలు
1. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్-30 (ఓసీ-12, ఓబీసీ-6, ఎస్సీ-3, ఎస్టీ-9)
2. సేఫ్టీ ఆఫీసర్స్-10 (ఓసీ-3, ఓబీసీ-5, ఎస్టీ-2)
3. శాప్-ఏబీఏపీ/బేసిస్/డీసీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్-8 (ఓసీ-4, ఓబీసీ-3, ఎస్టీ-1).
4. మైన్స్ సర్వే-4 (ఓసీ-2, ఓబీసీ-1, ఎస్సీ-1)
5. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (జీడీఎంఓ)-20 (ఓసీ-10, ఓబీసీ-5, ఎస్సీ-3, ఎస్టీ-2).
6. మెడికల్ స్పెషలిస్ట్ (మెడిసిన్/రేడియాలజీ)-22 (ఓసీ-12, ఓబీసీ-7, ఎస్సీ-3).
వేతన గ్రేడ్లు
ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల్లో కొన్నింటిని ఉ3/ఉ4 గ్రేడ్లుగా; సేఫ్టీ ఆఫీసర్లను ఉ1/ఉ2/ ఉ3గా; డీసీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్‌ని ఉ3/ఉ4గా; మైన్స్ సర్వేను ఉ1గా; జీడీఎంఓను ఉ2గా; మెడికల్ స్పెషలిస్టు పోస్టుల్లో కొన్నింటిని ఉ2/ఉ3 గ్రేడ్లుగా పేర్కొన్నారు.
గ్రేడ్ల వారీగా వేతనాలు
ఉ1: రూ.20,600-46,500;
ఉ2: రూ.24,900 -50,500;
ఉ3: రూ.29,100-54,500;
ఉ4: రూ.32,900-58,000.
విద్యార్హత-అనుభవం
1. ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు ప్రముఖ/పెద్ద సంస్థల్లో అకౌంట్స్/ఫైనాన్స్/ఇంటర్నల్ ఆడిట్‌లో అనుభవం ఉండాలి.
2. సేఫ్టీ ఆఫీసర్స్‌కు కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ (మెకానికల్/ఎలక్ట్రికల్/ప్రొడక్షన్) ఉత్తీర్ణతతోపాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో ఫుల్‌టైమ్ డిప్లొమా. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
3. శాప్-ఏబీఏపీ/బేసిస్/డీసీ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్స్‌కు కనీసం 60 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ. బేసిస్/ఏబీఏపీలో శాప్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ఉండాలి. ఐటీ/ఏబీఏపీ/బేసిస్ రంగంలో పని అనుభవం ఉండాలి.
4. మైన్స్ సర్వే పోస్టులకు డిప్లొమా (సివిల్/మైనింగ్/మైన్స్ సర్వే) ఉత్తీర్ణతతోపాటు మైన్ సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి. మైన్ సర్వేయింగ్‌లో పని అనుభవం ఉండాలి.
5. జీడీఎంవోలకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
6. మెడికల్ స్పెషలిస్టు పోస్టులకు ఎంబీబీఎస్‌తోపాటు మెడిసిన్/రేడియాలజీలో ఎండీ/ఎంఎస్. సంబంధిత రంగంలో కనీసం ఏడాది నుంచి రెండేళ్ల అనుభవం ఉండాలి.
గరిష్ట వయో పరిమితి
ఉ1, ఉ2, ఉ3 గ్రేడ్లకు 37 ఏళ్లు;
ఉ4 గ్రేడ్‌కు 42 ఏళ్లు.
గమనిక: విద్యార్హత, అనుభవం, గరిష్ట వయోపరిమితికి 2016, సెప్టెంబర్ 7వ తేదీని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కులకు 85 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులకు 15 శాతం వెయిటేజీ ఇస్తారు. అభ్యర్థులు ఈ రెండు పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆన్‌లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు రుసుం
జనరల్/ఓబీసీ అభ్యర్థులు
రూ.300 చెల్లించాలి.
చివరి తేది
2016 సెప్టెంబర్ 7.
వెబ్‌సైట్: www.ntpccareers.net