
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేశ్ ఆనంద్ సోమవారం కవాడిగూడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లతో పాటు దక్షిణ భాతర దేశంలోని సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1984లో చేరిన ఆయన.. 37 ఏళ్ల సర్వీసు కాలంలో పలు హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment