ntpc thermal power station
-
ఎన్టీపీసీ ఆర్‌ఈడీగా నరేశ్ ఆనంద్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నరేశ్ ఆనంద్ సోమవారం కవాడిగూడలోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ ప్లాంట్లతో పాటు దక్షిణ భాతర దేశంలోని సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా 1984లో చేరిన ఆయన.. 37 ఏళ్ల సర్వీసు కాలంలో పలు హోదాల్లో పనిచేశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) సభ్యుడిగా కూడా వ్యవహరించారు. -
ఎన్టీపీసీ ఆరో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్
జ్యోతినగర్ : కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఆరో యూనిట్లో విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వివరాల ప్రకారం... సోమవారం ఉదయం 10 గంటల సమయంలో బాయిలర్ ట్యూబ్ లీకేజీ చోటు చేసుకోవడంతో విద్యుదుత్పత్తి ఆగిపోయింది. వెంటనే ప్లాంట్ సిబ్బంది మరమ్మత్తు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం నాటికి ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ప్లాంట్ అధికారులు తెలిపారు.