
బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానాలు రద్దు
సాంకేతిక సమస్య కారణంగా ఆ విమానం రద్దు కావడంతో ఇక్కడి నుంచి ఆదివారం ఉదయం 7.15 గంటలకు బయలుదేరాల్సిన బీఏ 276 విమానం కూడా రద్దయింది. బీఏ 276 విమానం ఇక్కడి నుంచి 7.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు లండన్ హీత్రూ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ విమానంలో వెళ్లాల్సిన సుమారు 150 మంది ప్రయాణికులు ఆదివారం ఇబ్బందులు పడ్డారు. సోమవారం ఉదయం తిరిగి ఇదే సమయానికి వెళ్లే బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమాన సమయాలు ఇంకా నిర్ధారించలేదు. ప్రయాణికులు తమ వెబ్‌సైట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చని బ్రిటిష్ ఎయిర్‌వేస్ వర్గాలు వెల్లడించాయి.