
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా దాదాపు 400 విమానాలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడటంతో యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది.
విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి పైలెట్లు, విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసేందుకు ఎఫ్‌ఏఏ ఇచ్చే నోటామ్ (నోటీస్ టు ఎయిర్‌మిషన్)లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే అగిపోవడంతో దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ ప్రకారం ఉదయం 5:31 గంటలకు యునైటెడ్ స్టేట్స్‌లో 400 విమానాలు ఆలస్యమైనట్లు తెలిపింది.
నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఎఫ్‌ఏఏ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే ప్రశ్నకు సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.
చదవండి: కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా..