సముద్రంలో కుప్పకూలిన నేవీ విమానం | A US Navy aircraft carrying 11 crew and passengers crashed into the Pacific Ocean | Sakshi
Sakshi News home page

సముద్రంలో కుప్పకూలిన నేవీ విమానం

Published Wed, Nov 22 2017 3:28 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

A US Navy aircraft carrying 11 crew and passengers crashed into the Pacific Ocean - Sakshi - Sakshi - Sakshi

టోక్యో: అమెరికా నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. జపాన్‌లోని ఒకినావా సమీపంలో పసిఫిక్‌ మహాసముద్రంలో విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 11 మంది నేవీ సిబ్బంది ఉన్నారు. విమాన ప్రమాదాన్ని అమెరికా నేవీ ధ్రువీకరించింది.

జపాన్‌ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.45 గంటలకు ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రకటించారు. విమాన‌ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగాన్‌ సిబ్బంది అక్క‌డ‌కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల గురించి స‌మాచారం అందాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement