
ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : అమెరికాకు చెందిన నలుగురు నేవీ సైనికులు హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ సంఘటన మంగళవారం జరిగినట్లు బుధవారం నేవీ అధికారులు వెల్లడించారు. కాలిఫోర్నియాలో ఒక సాధారణ శిక్షణలో భాగంగా విన్యాసం చేస్తున్నపుడు ఈ ప్రమాదం జరిగింది. మెక్సికో సరిహద్దులోని ఇల్ సెట్రోల ప్రాంతంలో హెలికాఫ్టర్(సీహెచ్-53ఈ సూపర్ స్టాలియన్) కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment