విమానంలో చేయకూడని పని చేశాను.. సారీ! | Indian writes apology note for his stupid action | Sakshi
Sakshi News home page

విమానంలో చేయకూడని పని చేశాను.. సారీ!

Published Fri, Dec 23 2016 9:50 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

విమానంలో చేయకూడని పని చేశాను.. సారీ! - Sakshi

విమానంలో చేయకూడని పని చేశాను.. సారీ!

న్యూయార్క్‌: అమెరికాలో నివసిస్తున్న ఓ భారతీయుడు విమానంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ముంబై నుంచి న్యూజెర్సీలోని నెవార్క్‌ వెళుతున్న ఎయిరిండియా విమానంలో అతను ఈ విధంగా దుశ్ప్రవర్తనకు పాల్పడ్డాడు. మహిళను అసభ్యంగా తాకాడు. ఇందుకుగాను క్షమాపణ కోరుతూ అతను లేఖలు రాశాడని అధికారులు తెలిపారు. తనను లైంగికంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత మహిళ ఫిర్యాదు చేయడంతో ఎయిర్‌పోర్టు అధికారులు 40 ఏళ్ల గణేష్‌ పార్కర్‌ను అరెస్టు చేశారు. అతను నెవార్క్‌ ఫెడరల్‌ కోర్టులో విచారణ ఎదుర్కొంటున్నాడు.

‘ఎయిరిండియా విమానంలో తనది బిజినెస్‌ క్లాస్‌ సీటు అయినప్పటికీ పార్కర్‌ ఎకానమీ క్లాస్‌లో ఓ మహిళ పక్కన ఖాళీగా ఉన్న సీటులో కూర్చున్నాడు. నిద్రపోతున్న మహిళ తన బ్లాంకెట్‌ను ఎవరో తొలగించినట్టు అనిపిస్తే లేచి చూసింది. మళ్లీ నిద్రలోకి జారుకోగా.. పార్కర్‌ ఆమె చొక్కాలోకి చెయ్యిపెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో షాక్‌ తిన్న మీరు ఏం చెస్తున్నారని కేకలు వేసింది’ అని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. దీంతో పార్కర్‌ను తనకు కేటాయించిన సీటు వద్దకు విమాన సిబ్బంది పంపించేశారని, అయితే, తాను మూర్ఖమైన చర్యకు పాల్పడ్డానని పార్కర్‌ అంగీకరిస్తూ.. క్షమాపణ నోటు రాసి పెట్టారని వారు వివరించారు. 50వేల డాలర్ల పూచీకత్తుమీద పార్కర్‌ జైలు నుంచి విడుదలైనా.. కొంతకాలంపాటు హౌస్‌ అరెస్టులో ఉండాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement