సాక్షి, హైదరాబాద్ : సాంకేతిక సమస్యల కారణంగా బుధవారం మెట్రో రైలు మరోసారి ఆగిపోయింది. ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో 20 నిమిషాలకు పైగా రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా మెట్రోరైలు లోగడ చాలాసార్లు నిలిచిపోయింది. గత జనవరిలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ బయల్దేరిన రైలు పంజాగుట్ట మెట్రోస్టేషన్‌కు చేరుకోగానే నిలిచిపోయింది. సిబ్బంది వెంటనే ప్రయాణికులను దింపేశారు. ఒక్కసారిగా రైలు ఆగిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ( వావ్.. వజీర్..)
కాగా, మెట్రో రైల్ సర్వీసులు ప్రారంభమై మూడేళ్లయింది. అన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. దాని భద్రత పర్యవేక్షణకు అంశాలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేక విభాగం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆదిలోనే అటకెక్కాయి. సాధారణ రైళ్లల్లో జరిగే నేరాలు, రైల్వేస్టేషన్ల పర్యవేక్షణకు గవర్నమెంట్ రైల్వేపోలీసు (జీఆర్పీ) విభాగం ఉన్నట్లే.. మెట్రో రైల్ కోసం మెట్రో రైల్ పోలీస్ ఫోర్స్ (ఎంఆర్‌పీఎఫ్) విభాగాన్ని ఏర్పాటు చేయాలని 2017లో ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ నిర్ణయం ఇప్పటికీ అమలులోకి రాలేదు సరికదా.. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
Comments
Please login to add a commentAdd a comment