
సాక్షి, తిరుపతి: తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాయంత్రం 6 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు దానిని నిలిపివేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. ఆ తర్వాత ఏసీ పనిచేస్తుందని విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. తీరా బయలుదేరిన సమయంలో ఏసీ మళ్లీ పనిచేయలేదు. దీంతో ఏసీ లేకుండానే ప్రయాణికులు హైదరాబాద్‌కు పయనమయ్యారు. స్పైస్‌జెట్ సేవలపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.