శంషాబాద్, న్యూస్‌లైన్: విమానయాన చార్జీల మోత మోగుతోంది. సమైక్య ఉద్యమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పటారు. దీంతో రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో పాటు రైళ్లు కిటకిటలాడుతుండడంతో ప్రయాణికులు విమానయానం పై దృష్టి సారించారు. ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుపతి వెళ్లడానికి ప్రయాణికులు ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నిత్యం ఐదు విమానాలు తిరుపతికి రాకపోకలు సాగిస్తుంటాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌వేస్ ఉదయం 7.20 గంటలకు తిరిగి సా యంత్రం 4.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది.
దీంతో పాటు జెట్ కనెక్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలు ప్రతి రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు ఇక్కడి నుంచి తిరుపతి టేకాఫ్ తీసుకుంటా యి. దీంతో పాటు ఎయిర్ ఇండియాకు చెంది న ఓ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్తుంది. సాధారణంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రయాణ చార్జీలు రూ. 2,600 పైగా ఉంటాయి.
ట్రాఫిక్ రద్దీతో కేవల ఒక్కరోజు మాత్రమే ముందుగా బుక్‌చేసుకుంటున్న వారికి ప్రస్తుత చార్జీలు రూ.3,600 నుంచి రూ.7వేల వరకు ఉంటున్నాయి. ఆదివారం, సెలవు రోజులు వస్తుండడంతో ముందుగానే ఎయిర్‌లైన్స్ చార్జీలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లే ప్రయాణికులు కూడా ఎక్కువగా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా బెంగళూరు వెళ్లే ప్రయాణికుల రద్దీ కూడా ఇంతకింతకూ పెరుగుతోంది. వైజాగ్‌కు ఇక్కడి నుంచి ప్రతిరోజు నాలుగు విమానసర్వీసులున్నాయి.
ఉదయం 7 గంటలు, సాయంత్రం 6 గంటల సమయం లో స్పైస్‌జెట్ ఎయిర్‌వేస్ సర్వీసులున్నాయి. ఎయిర్ ఇండియా విమానం ఉదయం 7గంటలకు, ఇండిగో ఎయిర్‌వేస్ ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా యి. సాధారణ సమయాల్లో యాభైశాతం ఆ క్యుపెన్సీ కూడా ఉండని విమానాల్లో ఇప్పు డు 80 నుంచి వందశాతం ఉంటున్నాయని విమానాశ్రయవర్గాలు వెల్లడిస్తున్నాయి. విశాఖపట్న ం, విజయవాడలకు సాధారణ సమయాల్లో రూ. 2,600 నుంచి రూ.3 వేల వరకు మాత్ర మే చార్జీలు ఉండగా ప్రస్తుతం చార్జీలు రూ. 3,900 నుంచి రూ.7వేల వరకు ఉంటున్నాయి.
రాజమండ్రికి రద్దీ ఎక్కువ
శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాజమండ్రికి ప్రతి రోజు రెండు విమానసర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఉదయం 9.45 గంటలకు స్పైస్‌జెట్, మధ్యాహ్నం 12.45 గంటలకు జెట్‌కనెక్ట్ ఎయిర్‌లైన్స్‌లు ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. ప్రస్తుతం వీటి చార్జీలు రూ.4,900 నుంచి రూ. 9,400 వరకు అత్యధికంగా ఉన్నాయి. సాధారణ సమయాల్లో రూ.3 వేల లోపు మాత్రమే ఉండే రాజమండ్రి చార్జీలు ఒక్కసారిగా పెరిగాయి.
అక్కడి నుంచి వచ్చే చార్జీలే ఎక్కువ
ఇదిలా ఉంటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాలకు ఇక్కడి నుంచి వెళ్లే చార్జీలు పెరిగినప్పటికీ అటువైపు నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చే చార్జీలు ఇక్కడి వాటితో పోలిస్తే రెండింతలున్నాయి. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావడానికి కనిష్టంగా రూ.5 వేల చార్జీతో మొదలై గరిష్టంగా రూ. 9 వేలకుపైగా పెరిగాయి. ఇక రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడలది కూడా ఇదే పరిస్థితి. మొత్తమ్మీద సమైక్య సెగతో రోడ్డు రవాణా వ్యవస్థ స్తంభించడం ఎయిర్‌లైన్స్ సంస్థలకు వరంగా మారింది.
చార్జీలు ‘విమానం మోత’
Published Sun, Aug 18 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
Advertisement
Advertisement