కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి నియామకమయ్యారు.
పరిగి, న్యూస్‌లైన్: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం పరిగిలో ఆ శాఖ కేంద్ర మంత్రి మునియప్ప నుంచి నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన కార్యక్ర మాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.
కేంద్ర పరిశ్రమల శాఖ బోర్డు డెరైక్టర్‌గా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన కేంద్ర మంత్రి మునియప్ప, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్‌సింగ్, మాజీ మంత్రి సబితారెడ్డి, మంత్రి ప్రసాద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు నారాయణరెడ్డి, నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రామకృష్ణ, ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.