t ram mohan reddy
-
కేసీఆర్ మౌనం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు టీఎంసీల నీళ్ల కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన సీఎం కేసీఆర్ పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణా నీటిని తీసుకెళ్తుంటే మౌనంగా ఎందుకు ఉంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జూమ్ యాప్ ద్వారా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తే తెలం గాణ 6 టీఎంసీ నీళ్లను నష్టపోతుందని చెప్పారు. 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేందుకు జీవో జారీ చేసినా కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ ప్రతిపాదన పూర్తయితే నాగార్జున సాగర్–పాలమూరు ఎత్తిపోతల–కల్వకుర్తి ప్రాజెక్టులకు చుక్క నీరు ఉండవని, దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ కోసం అక్కడి ప్రభుత్వం ఈనెల 11న టెండ ర్లు పిలుస్తున్నట్టు తెలుస్తోందని, ఆ ప్రక్రియ పూర్తి కావాలనే అపెక్స్ భేటీ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరారని ఆరోపించారు. ఉత్తమ్ మోకాలికి గాయం: ఉత్తమ్‌కుమార్ రెడ్డి మోకాలికి గాయమైంది. ఇటీవల ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మెట్లపై నుంచి జారి పడ్డారని, దీంతో మోకాలికి బలమైన గాయం తగిలిందని గాంధీభవన్ వర్గాలు శనివారం వెల్లడించాయి. ఆయన 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపాయి. శనివారం మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, చల్లా వంశీచంద్‌రెడ్డి ఉత్తమ్‌ను కలిసి పరామర్శించారు. -
‘నయీమ్ ఆస్తులు కేసీఆర్ ఖాతాలోకి వెళ్లాయా’
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌స్‌పై కాంగ్రెస్ నాయకులు రామ్మోహన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గజ్జెల కాంతం మండిపడ్డారు. కాంగ్రెస్ దయ వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి కాగలిగారనీ, కానీ కనీస స్పృహ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో 34వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ విమర్శలు చేయడం అవివేకమని రామ్మోహన్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలన్నిటిని మాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. రుణాలు మాఫీ కాకాపోవడంతో వడ్డీల భారంతో రైతులు కుంగిపోతున్నారని అన్నారు. నయీమ్ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలి నయీమ్ గ్యాంగ్‌స్టర్‌గా మారడానికి పొలికల్ లీడర్స్, పోలీసులే కారకులని గజ్జెల కాంతం అన్నారు. నయీమ్ హత్యానంతరం పట్టబడిన డబ్బు, ఆస్తులు కేసీఆర్ ఖాతాలోకి వెళ్లాయా.. ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లాయా వెల్లడించాలనీ.. నయీమ్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసుతో సంబంధాలున్న 25 మంది పోలీసులపై, రెవెన్యూ యంత్రాంగంపై చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అవినీతి నేతలకు, అధికారులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తోందనీ ఆరోపించారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రైతుబంధు పథకం పెట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గతంలో ప్రాణహిత తప్పుడు ప్రాజెక్టు అని వ్యాఖ్యానించిన కేసీఆర్.. ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు కోరారని మండిపడ్డారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. -
కేంద్ర పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా టీఆర్ఆర్
పరిగి, న్యూస్‌లైన్: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం పరిగిలో ఆ శాఖ కేంద్ర మంత్రి మునియప్ప నుంచి నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన కార్యక్ర మాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర పరిశ్రమల శాఖ బోర్డు డెరైక్టర్‌గా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన కేంద్ర మంత్రి మునియప్ప, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్‌సింగ్, మాజీ మంత్రి సబితారెడ్డి, మంత్రి ప్రసాద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు నారాయణరెడ్డి, నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రామకృష్ణ, ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.