central industrial department
-
AP CID : చంద్రబాబు స్కిల్ స్కాంలో 10 కీలక అంశాలు
సాక్షి, విజయవాడ: స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ అన్నారు. గురువారం.. మీడియా సమావేశంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి మాట్లాడిన ఏపీ సీఐడీ.. ఈ స్కామ్‌లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రెస్ మీట్లో వెల్లడించిన ముఖ్యమైన అంశాలు ఇవి ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► స్కిల్ స్కామ్ లో రూ.371 కోట్ల అవినీతి జరిగింది ► ఈ స్కామ్ లో మొత్తం 10 కీలక అంశాలు ఉన్నాయి ► నిబంధనలకు విరుద్ధంగా నిధులను రిలీజ్ చేశారు ► అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు ► తప్పుడు డాక్యుమెంట్స్ తో ఒప్పందాలు చేసుకున్నారు ► ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్ కు చాలా తేడాలు ఉన్నాయి ► అగ్రిమెంట్ లో జీవో నెంబర్ ను చూపించలేదు ► జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్ లో లేవు ► సీమెన్స్ కంపెనీ ట్రైనింగ్ మాడ్యూల్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు ► ఎక్కడా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ పెడతామని చెప్పలేదు ► కేబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు ► కార్పొరేషన్ ఏర్పాటులో విధివిధానాలు పాటించలేదు ► స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఖజానాను దోచేశారు ► రూ.3,300 కోట్లు ఫ్రీగా సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10 శాతం ఇస్తే సరిపోతుందన్నారు ► ఏపీ ఖజానా నుండి రూ.371 కోట్లు డిజైన్ టెక్ కు చెల్లించారు ► పైలట్ ప్రాజక్టు అమలు చేయాలన్న అధికారుల వాదనను పట్టించుకోలేదు ‘‘నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లను రిలీజ్ చేశారు. అధికారుల అభ్యంతరాలను నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. తప్పుడు డాక్యుమెంట్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం జీవోకు,అగ్రిమెంట్‌కు చాలా తేడాలున్నాయి. అగ్రిమెంట్లో జీవో నంబర్‌ను చూపించలేదు. జీవోలో ఉన్న అంశాలు అగ్రిమెంట్లో లేవు’’ అని సీఐడీ వివరించింది. ఇవీ బాబు సంతకాలు.. ఇంతకంటే ఇంకేమీ కావాలి ఆధారాలు.? ఇక ఇవ్వాళ రాజమండ్రిలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఎక్కడైనా చంద్రబాబు సంతకం ఉందా? ప్రూవ్ చేయండి అంటూ ప్రశ్నించడం గురించి కొందరు మీడియా ప్రతినిధులు సీఐడీ చీఫ్ సంజయ్‌ను వివరణ అడిగారు. దానిపై స్పందించిన సీఐడీ చీఫ్.. చంద్రబాబు ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు సంతకాలు పెట్టారో వివరించారు. చంద్రబాబు డిజిటల్ సైన్ కాపీని చూపించారు. చదవండి: ఇదంతా చంద్రబాబుకి తెలిస్తే ఫీల్ అవ్వరా? -
కేంద్ర పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా టీఆర్ఆర్
పరిగి, న్యూస్‌లైన్: కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ బోర్డు ప్రత్యేక డెరైక్టర్‌గా పీసీసీ కార్యదర్శి టి.రామ్మోహన్‌రెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం పరిగిలో ఆ శాఖ కేంద్ర మంత్రి మునియప్ప నుంచి నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన కార్యక్ర మాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర పరిశ్రమల శాఖ బోర్డు డెరైక్టర్‌గా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అందుకు సహకరించిన కేంద్ర మంత్రి మునియప్ప, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, దిగ్విజయ్‌సింగ్, మాజీ మంత్రి సబితారెడ్డి, మంత్రి ప్రసాద్‌కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు నారాయణరెడ్డి, నర్సింహారావు, వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్, రామకృష్ణ, ఎదిరె కృష్ణ తదితరులు పాల్గొన్నారు.