కేసీఆర్ కు మానవత్వం లేదు: సబిత, సునీత | kcr dont have a humaniy:sunitha laxma reddy and sabitha reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ కు మానవత్వం లేదు: సబిత, సునీత

Published Sun, May 8 2016 2:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కేసీఆర్ కు మానవత్వం లేదు: సబిత, సునీత - Sakshi

కేసీఆర్ కు మానవత్వం లేదు: సబిత, సునీత

సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు మానవత్వం లేదని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పీఏసీ చైర్మన్‌గా ఉన్న రాంరెడ్డివెంకటరెడ్డి అకాలమరణం చెందితే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరడానికి వెంకటరెడ్డి సతీమణి సుచరిత సమయం అడిగినా కేసీఆర్ ఇవ్వలేదన్నారు. కేసీఆర్ దీక్ష సందర్భంగా ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యాన్ని కాపాడటానికి నిమ్స్‌కు తరలించే విషయంలో మంత్రిగా ఉన్న వెంకటరెడ్డి కృషి చేశారన్నారు. టీడీపీలో సమైక్యవాదిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవినిచ్చి, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీచేయిస్తున్న కేసీఆర్, అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎందుకు పదవి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement