కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువు
మాజీ మంత్రులు డీకే అరుణ, సబిత
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మాజీ మంత్రులు డి.కె.అరుణ, సబితాఇంద్రారెడ్డి అన్నారు. నిర్భయచట్టం అమలులో కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన యామిని, శ్రీలేఖ తల్లిదండ్రులు హైమావతి, కృష్ణారెడ్డిలను గురువారం హైదరాబాద్ హస్తినాపురంలో పరామర్శించారు. అమ్మాయిలను కిరాతకంగా హతమార్చి వారం గడచినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు.
మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకుండా మహిళలను కేసీఆర్ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడ్ని పట్టుకోవడంలో విఫలమైన హోంమంత్రిని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.