
తపాలా బిళ్లల రద్దు తగదు
అఫ్జల్‌గంజ్ : ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలపై రూపొందించిన తపాలా బిళ్లల రద్దుకు నిరసనగా టీపీసీసీ నాయకులు మంగళవారం అబిడ్స్‌లోని జీపీవో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ తపాలా బిళ్లలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. తపాలా బిళ్లలు పునరుద్ధరించాలని కోరుతూ చీఫ్ పోస్ట్ మాస్టర్ సుధీర్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.