తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ-కాంగ్రెస్ మైత్రి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన బంధం తేటతెల్లం కాగా ...తాజాగా టీడీపీ-కాంగ్రెస్ బంధం కూడా మరోసారి బయటపడింది. తెలంగాణలో ఏర్పడిన ఆ రెండు పార్టీల బంధం...ఏపీలోనూ పునరావృతమైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని గెలిపించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్థానికేతరుడైన ఓ డమ్మీ అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు.