
ఇబ్రహీంపట్నం (మైలవరం): గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన పుర పథకం నిలిపివేయటం వెనుక సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి ఉమామహేశ్వరరావు కుట్ర దాగి ఉందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. పుర పథకం పనుల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం ఆయన ఇబ్రహీంపట్నం విచ్చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పనులు ప్రారంభించనందుకు వ్యతిరేకంగా అక్కడ మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ ఆ పథకం పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి మంచిపేరు వస్తుందని సీఎం చంద్రబాబు, మంత్రి ఉమా కుట్ర పన్ని పథకాన్ని నిర్వీర్యం చేశారని ఆగ్రహించారు.
Comments
Please login to add a commentAdd a comment