నగరం(మామిడికుదురు) :పైప్‌లైన్ విస్ఫోటంతో తీవ్రంగా నష్టపోయిన నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. స్థానిక జీసీఎస్ ఎదురుగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి విదితమే. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు స్థానిక పీహెచ్‌సీని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, మినర ల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని, గ్రామంలో ప్రతి పేటకు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని, తదితర డిమాండ్లతో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. పార్టీ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అభివృద్ధి సంక్షేమ సంఘం డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రిలే దీక్షల్లో సంక్షేమ సంఘం ప్రతినిధులు బొంతు మణిరాజు, జాలెం సుబ్బారావు, ముకరం హుస్సేన్, మొల్లేటి సత్యనారాయణ, వీరవల్లి చిట్టిబాబు, బొక్కా సత్యనారాయణ, మొల్లేటి కృష్ణమూర్తి, వానరాశి తాతాజీ, మొల్లేటి ఏడుకొండలు, మొల్లేటి నాగేశ్వరరావు, మొల్లేటి పద్మావతి, కడలి అనంతలక్ష్మి, చెల్లింగి ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
Published Sun, Jan 25 2015 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement
Advertisement