pipeline explosion
-
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
-
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ ఓ మంచినీటి పైప్‌లైన్ పగిలింది. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేస్తూ పగలడంతో నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. దాంతోపాటే రోడ్డు కూడా పగిలిపోయింది, అక్కడున్న కార్లు గాల్లోకి లేచాయి, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదంతా అక్కడకు దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రోడ్డు దానంతట అదే కదులుతూ పెద్ద పేలుడు, దాంతోనే భారీగా బురద వచ్చినట్లు ఆ ఫుటేజిలో కనిపించింది. ఆ ఉత్పాతానికి కొద్ది సెకన్ల ముందు అక్కడే ఫుట్‌పాత్ మీద ఒక మహిళ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం కనిపించింది గానీ, దాని తర్వాత ఆమె ఏమైందో తెలియలేదు. ఆ తర్వాత వీధులలో కూడా మట్టితో కూడిన నీరు ప్రవహించింది. పై అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో తెలియక బయటకు వచ్చి ఆ నీళ్లు చూసి షాకవడం కూడా కనిపించింది. ఆ వీడియో వెంటనే పలు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ అయింది. ఏడో అంతస్తు వరకు కూడా మట్టి నీళ్లు వెళ్లాయని, ఆ నీళ్లతో పాటు ఇసుక కూడా వచ్చిందని రెడిట్ యూజర్ ఒకరు కామెంట్ చేశారు. నీటిపైపు పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్ల అద్దాలు పగిలిపోయాయి. వాటి మీద విపరీతంగా బురద పేరుకుపోయింది. అసలు ఆ పేలుడు ఎందుకు సంభవించిందీ ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇందులో ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదని అక్కడి పాత్రికేయులు అంటున్నారు. -
'గెయిల్' హామీని నిలబెట్టుకోవాలి
మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీని గెయిల్ యాజమాన్యం నిలబెట్టుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. గత ఏడాది జిల్లాలోని నగరం గ్రామంలో గత ఏడాది గ్యాస్ పైప్‌లైన్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఆ సందర్భంగా నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని గెయిల్ యాజమాన్యం వాగ్దానం చేసింది. కానీ హామీని అమలు చేయకపోవడంతో గ్రామస్తులు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి సంఘీభావం తెలిపారు. -
రెండో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు
నగరం(మామిడికుదురు) :పైప్‌లైన్ విస్ఫోటంతో తీవ్రంగా నష్టపోయిన నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం రెండో రోజుకు చేరాయి. స్థానిక జీసీఎస్ ఎదురుగా ఈ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన సంగతి విదితమే. నగరం గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు స్థానిక పీహెచ్‌సీని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయడం, మినర ల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని, గ్రామంలో ప్రతి పేటకు సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని, తదితర డిమాండ్లతో అభివృద్ధి సంక్షేమ సంఘం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. వీరి దీక్షలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. పార్టీ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. అభివృద్ధి సంక్షేమ సంఘం డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని పార్టీ పి.గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రిలే దీక్షల్లో సంక్షేమ సంఘం ప్రతినిధులు బొంతు మణిరాజు, జాలెం సుబ్బారావు, ముకరం హుస్సేన్, మొల్లేటి సత్యనారాయణ, వీరవల్లి చిట్టిబాబు, బొక్కా సత్యనారాయణ, మొల్లేటి కృష్ణమూర్తి, వానరాశి తాతాజీ, మొల్లేటి ఏడుకొండలు, మొల్లేటి నాగేశ్వరరావు, మొల్లేటి పద్మావతి, కడలి అనంతలక్ష్మి, చెల్లింగి ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
నగరం ఘటనలో 22కి చేరిన మృతులు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ పైపు లైన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు (58) మృతి చెందాడు. దీంతో నగరం గెయిల్ పైపు లైన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ సంస్థకు చెందిన పైపు లైన్ పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా, మరో 19 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అమలాపురంలోని కిమ్స్ నుంచి కాకినాడ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అలా కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు మృతి చెందాడు.