అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ ఓ మంచినీటి పైప్‌లైన్ పగిలింది. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేస్తూ పగలడంతో నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. దాంతోపాటే రోడ్డు కూడా పగిలిపోయింది, అక్కడున్న కార్లు గాల్లోకి లేచాయి, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదంతా అక్కడకు దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రోడ్డు దానంతట అదే కదులుతూ పెద్ద పేలుడు, దాంతోనే భారీగా బురద వచ్చినట్లు ఆ ఫుటేజిలో కనిపించింది.