cars damaged
-
చెన్నైలో 200 కార్లు దగ్ధం
సాక్షి, చెన్నై: బెంగళూరు ఏరో ఇండియా షో పార్కింగ్‌లో 300 కార్లు బుగ్గిపాలైన మరుసటి రోజే చెన్నైలో అదే తరహా ప్రమాదం సంభవించింది. శివారు ప్రాంతం పోరూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి, వైద్య కళాశాల ఎదురుగా పార్కింగ్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగి 200 కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ఆర్పకుండా పడేసిన సిగరెట్ పీక ఎండు గడ్డిపోచకు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ కార్లలో కొన్ని కొత్తవి, మరికొన్ని ఈఎంఐలు చెల్లించకపోవడంతో స్వాధీనం చేసుకున్నవి ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. అగ్ని కీలలు విస్తరించాక దట్టంగా కమ్ముకున్న పొగతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఏడు ఫైరింజన్లు సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అన్ని కార్లలో ఇంధనం ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత భారీగా ఉండేదని భావిస్తున్నారు. పార్కింగ్ చేసి ఉన్న 216 కార్లలో 184 పూర్తిగాను, 16 పాక్షికంగాను బుగ్గిపాలయ్యాయి. రూ.50 కోట్లు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. -
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
-
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ ఓ మంచినీటి పైప్‌లైన్ పగిలింది. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేస్తూ పగలడంతో నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. దాంతోపాటే రోడ్డు కూడా పగిలిపోయింది, అక్కడున్న కార్లు గాల్లోకి లేచాయి, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదంతా అక్కడకు దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రోడ్డు దానంతట అదే కదులుతూ పెద్ద పేలుడు, దాంతోనే భారీగా బురద వచ్చినట్లు ఆ ఫుటేజిలో కనిపించింది. ఆ ఉత్పాతానికి కొద్ది సెకన్ల ముందు అక్కడే ఫుట్‌పాత్ మీద ఒక మహిళ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం కనిపించింది గానీ, దాని తర్వాత ఆమె ఏమైందో తెలియలేదు. ఆ తర్వాత వీధులలో కూడా మట్టితో కూడిన నీరు ప్రవహించింది. పై అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో తెలియక బయటకు వచ్చి ఆ నీళ్లు చూసి షాకవడం కూడా కనిపించింది. ఆ వీడియో వెంటనే పలు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ అయింది. ఏడో అంతస్తు వరకు కూడా మట్టి నీళ్లు వెళ్లాయని, ఆ నీళ్లతో పాటు ఇసుక కూడా వచ్చిందని రెడిట్ యూజర్ ఒకరు కామెంట్ చేశారు. నీటిపైపు పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్ల అద్దాలు పగిలిపోయాయి. వాటి మీద విపరీతంగా బురద పేరుకుపోయింది. అసలు ఆ పేలుడు ఎందుకు సంభవించిందీ ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇందులో ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదని అక్కడి పాత్రికేయులు అంటున్నారు. -
వర్షం దెబ్బకు సిటీ కార్లు ఢమాల్
ఒక్కరోజు కురిసిన భారీ వర్షం హైదరాబాద్ వాసులను అల్లకల్లోలం చేసింది. బుధవారం నాడు కురిసిన వర్షం మిగిల్చిన నష్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భారీ వర్షంతో పలుచోట్ల నీళ్లు నిలిచిపోగా.. చాలాప్రాంతాల్లో నడుం లోతుకు పైగా నీళ్లున్నాయి. అపార్టుమెంట్ల సెల్లార్లలోకి నీళ్లు చేరుకున్నాయి. చివరకు రోడ్ల మీద వెళ్తున్న కార్ల లైట్లు కూడా మునిగిపోయేంత స్థాయిలో నీళ్లొచ్చాయి. ఈ ప్రభావం ప్రధానంగా కార్లు, ద్విచక్ర వాహనాల మీద ఎక్కువగా కనిపించింది. చాలా కార్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇంజన్లలోకి నీళ్లు వెళ్లిపోవడంతో కదల్లేక మొరాయిస్తున్నాయి. ఇళ్ల బయట, సెల్లార్లలోను, ఆఫీసుల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలు ఎక్కువగా పాడైనట్లు తెలుస్తోంది. అప్పటికే ఆఫీసులకు వెళ్లిపోయినవాళ్లు వర్షం గురించి తెలిసినా.. బయట ఉన్న తమ వాహనాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఒకవేళ చూడాలనుకున్నా వెళ్లగలిగేలా లేదు. వర్షం తగ్గిన తర్వాత తమ వాహనాలు చూసుకుంటే.. ఎక్కడ ఉన్నవి అక్కడే ఆగిపోయాయి తప్ప కదిలే పరిస్థితి లేదు. తమ కారు ఆగిపోయింది.. టోయింగ్ చేయాలంటూ ఒక్కో టోయింగ్ సర్వీసుల వాళ్లకు వందలాది ఫోన్ కాల్స్ వెళ్లాయి. వర్షాల కారణంగా కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్లలోనే రెండువేల కార్లు పాడైనట్లు ట్రాఫిక్ కంట్రోల్ రూంకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సైబరాబాద్ నుంచి ఇలాంటివి మరో 2వేల కాల్స్ వచ్చాయి. ఇవి కాక ప్రైవేటు టోయింగ్ సర్వీసుల వాళ్లకు 1000-1500 కాల్స్ వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికీ చాలా సర్వీసు సెంటర్లలో చాలా కార్లు రిపేర్ల కోసం వేచి ఉన్నాయి. తనకు యాప్రాల్, మల్కాజిగిరి, హబ్సిగూడ లాంటి దూర ప్రాంతాల నుంచి కూడా తమ వాహనాలను తీసుకెళ్లాలంటూ కాల్స్ వచ్చాయని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉండే టోయింగ్ సర్వీసు యజమాని సత్తార్ సాహెబ్ చెప్పారు. ద్విచక్రవాహనాల పరిస్థితి కూడా అలాగే ఉంది. రోడ్లన్నీ చెరువులను తలపించడం, తప్పనిసరిగా ఆ నీళ్లలోంచే వెళ్లాల్సి రావడంతో బైకుల సైలెన్సర్లలోకి నీళ్లు వెళ్లిపోయాయి. దాంతో అవి ఆగిపోయి.. వాటిని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వాటన్నింటినీ రిపేర్లు చేయించుకోడానికి తల ప్రాణం తోకకు వస్తోంది. ఇప్పటికీ చాలా వాహనాలు షెడ్లలోనే ఉన్నాయి. శుక్రవారం సమ్మె కావడంతో బస్సులు తిరక్కపోవడం, మరోవైపు తమ వాహనాలు షెడ్లకే పరిమితం కావడంతో నగరవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. -
రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో రెయిలింగ్ కూలి 5 కార్లు ధ్వంసం అయ్యాయి. గురువారం మధ్యాహ్నం భవనం రెయిలింగ్ కూలి పడటంతో కింద పార్కు చేసిన ఐదు కార్లు దెబ్బతిన్నాయి. కాంప్లెక్స్ నిర్వాహకులు అప్రమత్తమై పెచ్చులను తొలగించి, దెబ్బతిన్న కార్లను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు. -
5,800 ల్యాండ్ రోవర్ కార్లు ధ్వంసం
బీజింగ్: చైనాలోని టియాంజిన్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 5800 ల్యాండ్ రోవర్ల కార్లు ధ్వంసమైనట్టు అధికారిక సమాచారం. భారత మాతృసంస్థ అయిన టాటా మోటార్ కంపెనీ 5800 కార్లను ముంబై నుంచి చైనాకు శుక్రవారం ఎగుమతి చేసింది. టియాంజిన్‌లోని వివిధ ప్రాంతాల్లో వీటిని నిల్వ ఉంచారు. దాదాపు 600 మిలియన్ డాలర్ల మేరకు నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.