ukraine city
-
రష్యా ప్రతీకార చర్య.. ఉక్రెయిన్‌పై మిసైల్స్‌తో భీకర దాడులు
కీవ్: కెర్చ్ వంతెన పేల్చివేతతో ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో రష్యాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కీలకమైన క్రిమియా-రష్యా వంతెనపై పేలుడుకు ఉక్రెయిన్ కారణమని ఆరోపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇది ముమ్మాటికి ఉగ్రవాద చర్యతో సమానమని విమర్శించారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో వరుస పేలుళ్లు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఉదయం 8.15 గంటలకు తొలిసారి పేలుడు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. బ్లాస్ట్ జరిగిన ప్రాంతానికి భారీగా అంబులెన్స్‌లు తరలివెళ్లాయని పేర్కొంది. ఉక్రెయిన్‌లో చాలా నగరాల్లో సోమవారం మిసైల్ దాడులు జరిగినట్లు ఆరోపించారు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ‘మిసైల్స్ దాడిలో ఉక్రెయిన్ చిక్కుకుంది. దేశంలోని చాలా నగరాల్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.’ అని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ‘రాజధాని కీవ్‌లోని షెవ్చెన్కివిస్కీ జిల్లాలో పలు భారీ స్థాయి పేలుళ్లు సంభవించాయి.’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కీవ్ మేయర్ విటాలి క్లిట్స్చ్కో. మరోవైపు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో పలు ప్రాంతాల్లో నల్లటి పొగ అలుముకున్నట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్‌పై చివరిసారిగా జూన్ 26న దాడి చేశాయి రష్యా సేనలు. తాజాగా కెర్చ్ వంతెన కూల్చివేతకు ప్రతీకార దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌లోని జపోరిజియా ప్రాంతంలో రష్యా ఆదివారం జరిపిన మిసైల్స్ దాడుల్లో 13 మంది మరణించారు. ఈ దాడిని అత్యంత క్రూరమైన దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. ఈ దాడిలో 11 మంది చిన్నారుల సహా మొత్తం 89 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యాలోని కీలక వంతెన పేలుడు తర్వాత ఉక్రెయిన్ పేలుళ్ల ఘటనలు పెరిగాయి. దీంతో ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: క్రిమియా వంతెన బాంబు దాడి: ఉగ్రవాదమన్న పుతిన్.. ఉక్రెయిన్ ఘాటు కౌంటర్ -
రష్యా కు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
-
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
-
భారీ పేలుడు.. ఏమైందో తెలుసా?
అది ఉక్రెయిన్ రాజధాని కియెవ్ నగరం. అంతా నిశ్భబ్దంగా ఉంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. అపార్టుమెంట్లలోని ఏడో అంతస్తులో ఉన్న కిటికీల అద్దాలు కూడా పగిలిపోయాయి. భూమి బద్దలైంది. కార్లు గాల్లోకి లేచాయి. విపరీతంగా దుమ్ము వ్యాపించింది. ఏదో బాంబు పేలిందని అనుకున్నారు. తీరా చూస్తే.. అక్కడ ఓ మంచినీటి పైప్‌లైన్ పగిలింది. భూగర్భంలో ఉన్న పైప్‌లైన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేస్తూ పగలడంతో నీళ్లు ఉవ్వెత్తున లేచాయి. దాంతోపాటే రోడ్డు కూడా పగిలిపోయింది, అక్కడున్న కార్లు గాల్లోకి లేచాయి, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. ఇదంతా అక్కడకు దగ్గరలో ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. రోడ్డు దానంతట అదే కదులుతూ పెద్ద పేలుడు, దాంతోనే భారీగా బురద వచ్చినట్లు ఆ ఫుటేజిలో కనిపించింది. ఆ ఉత్పాతానికి కొద్ది సెకన్ల ముందు అక్కడే ఫుట్‌పాత్ మీద ఒక మహిళ ఫోన్లో మాట్లాడుతూ వెళ్లడం కనిపించింది గానీ, దాని తర్వాత ఆమె ఏమైందో తెలియలేదు. ఆ తర్వాత వీధులలో కూడా మట్టితో కూడిన నీరు ప్రవహించింది. పై అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి ఏం జరిగిందో తెలియక బయటకు వచ్చి ఆ నీళ్లు చూసి షాకవడం కూడా కనిపించింది. ఆ వీడియో వెంటనే పలు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ అయింది. ఏడో అంతస్తు వరకు కూడా మట్టి నీళ్లు వెళ్లాయని, ఆ నీళ్లతో పాటు ఇసుక కూడా వచ్చిందని రెడిట్ యూజర్ ఒకరు కామెంట్ చేశారు. నీటిపైపు పేలుడు వల్ల చుట్టుపక్కల ఉన్న కార్ల అద్దాలు పగిలిపోయాయి. వాటి మీద విపరీతంగా బురద పేరుకుపోయింది. అసలు ఆ పేలుడు ఎందుకు సంభవించిందీ ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇందులో ఎవరూ గాయపడినట్లు మాత్రం సమాచారం అందలేదని అక్కడి పాత్రికేయులు అంటున్నారు.