మామిడికుదురు: తూర్పు గోదావరి జిల్లాలో నగరం గ్రామ పంచాయతీని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హామీని గెయిల్ యాజమాన్యం నిలబెట్టుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ డిమాండ్ చేసింది. గత ఏడాది జిల్లాలోని నగరం గ్రామంలో గత ఏడాది గ్యాస్ పైప్‌లైన్ లీకై అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.
ఆ సందర్భంగా నగరం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని గెయిల్ యాజమాన్యం వాగ్దానం చేసింది. కానీ హామీని అమలు చేయకపోవడంతో గ్రామస్తులు గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు కుడిపూడి చిట్టబ్బాయి సంఘీభావం తెలిపారు.