
ప్రత్యేక నినాదాల హోరు
ప్రత్యేక హోదా నినాదాలతో జిల్లాలోని ఆర్టీసీ డిపోలు బుధవారం దద్దరిల్లాయి. రిలే నిరాహార దీక్షలు ఐదో రోజుకు చేరుకోగా మరో పక్క కొవ్వొత్తుల ర్యాలీలు.. కాగడాల ప్రదర్శనలు జరిగాయి. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌సీపీ అధినాయకత్వం పిలుపుతో జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు, బస్‌కాంప్లెక్స్‌ల ఎదుట ధర్నాలు.
బైఠాయింపులు జరిపారు. అనకాపల్లిలో పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మాడుగులలో ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.