
సాక్షిప్రతినిధి, విజయనగరం: మండుటెండలు సైతం లెక్క చేయకుండా... రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ జిల్లా నేతలు శనివారం జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ‘పదవులు మా కొద్దు... ప్రత్యేక హోదా కావాలం’టూ రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలు ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టగా వారికి జిల్లాలో సంపూర్ణ మద్దతు లభిస్తోంది. రాష్ట్రానికి పట్టిన చీకట్లు తొలగిపోయి ప్రత్యేక హోదా రావాలని కాంక్షిస్తూ కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలతో మొదలైన ఈ సంఘీభావ ఉద్యమంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులు స్వయంగా దీక్షల్లో కూర్చొని ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.
► ఎంపీల రాజీనామాలకు మద్దతుగా కురుపాంలోని రావాడ కూడలిలో వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో జరి గిన ఈ దీక్షలో అరుకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీ పీ ఆనిమి ఇందిరా కుమారి, ఐదు మండలాల కన్వీనర్లు, జిల్లా అధికార ప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
► విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పార్టీ నగర కన్వీనర్ ఆశపు వేణుతో పాటు ఇతర నాయకులు పాల్గొనగా పార్టీ నాయకులు యడ్ల రమణమూర్తి దీక్షలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి ప్రా రంభించారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ జి ల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు దీక్షా శిబి రాన్ని సందర్శించి సంఘీభావం తెలి పారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, మున్సిప ల్ కౌన్సిలర్ ఎస్.వి.వి.రాజేష్ పాల్గొన్నారు. సాయంత్రం భారీ ఎత్తున మానవహారం నిర్వహించి హోదాకాంక్షను వెల్లడించారు. కోలగట్ల, మజ్జిశ్రీనివాసరావు ఇందులో పాల్గొన్నారు.
► గజపతినగరం గణేష్ కూడలి వద్ద మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలేదీక్షలో గంట్యాడ మండల పార్టీ అధ్యక్షుడు వ ర్రి నర్సింహమూర్తి, జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ చైర్మన్ పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా నాయకులు కోడెల ముత్యాలనాయుడు పాల్గొన్నారు. వీరికి గజపతి నగరం, బొండపల్లి, దత్తిరాజేరు వైఎస్సార్‌సీపీ నాయకులు మద్దతు పలికారు.
► చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలను పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల నమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ప్రారంభిం చారు. తొలిరోజు గరివిడి మండలానికి చెం దిన మండల పార్టీ అధ్యక్షుడు వాకాడ శ్రీనివాసరావు, ఆర్‌ఈసీఎస్ మాజీ చైర్మన్ పొన్నాడ వెంకటరమణ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.
► బొబ్బిలి వైఎస్సార్‌సీపీ కార్యవర్గం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించగా బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోల అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూముల రామసుధీర్, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యుడు మర్రాపు జగన్నాథంనాయుడు, మున్సి పల్ మాజీ చైర్మన్ ఇంటి గోపాలరావు, రామభద్రపురం, తెర్లాం మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. ∙సాలూరు బోసుబొమ్మ జంక్షన్‌లో రిలేనిరాహార దీక్షలు సాలూరు మండల పార్టీ అధ్యక్షుడు సువ్వాడ రమణ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో జెడ్పీటీసీ, జిల్లా పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, సర్పంచ్ జన్ని సీతారాం, పార్టీ రాష్ట్ర నాయకులు జరజాపు ఈశ్వరరావు పాల్గొన్నారు.
► ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త ఎ.కె.వి.జోగినాయుడు నేతృత్వంలో స్థానిక దేవి జంక్షన్‌లో రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. దీక్షకు ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శులు రొంగలి జగన్నాథం, నెక్కల నాయుడుబాబు, గుడివాడ రాజేశ్వరరావుతో పాటు ఐదు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే కుంభారవిబాబు దీక్షా శిబిరాన్ని సందర్శించారు. సాయంత్రం భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు.
► పార్వతీపురంలోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్షల్లో పార్టీ సీనియర్ నాయకుడు జమ్మాన ప్రసన్నకుమార్, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, జిల్లా అధికార ప్రతినిధి వెంపల గుర్రాజుతో పాటు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ సారధ్యంలో హోదా సాధిస్తాం
– ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం మునిసిపాలిటీ: విభజనతో వెనుకబడిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన మానవహారంలో మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలే కారణమన్నారు. నాలుగేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు, బంద్‌లు, దీక్షలు చేపట్టడం ద్వారా హోదా ఆవశ్యకతను గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లారన్నారు. నాలుగేళ్లపాటు ప్యాకేజీల పేరిట స్వప్రయోజనాలను చూసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రజలు ఛీకొట్టే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే ఆయన యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తన ఎంపిలతో రాజీనామాలు చేయించి పోరాటానికి కలసిరావాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు తాకట్టు
–ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం: ఓటుకు నోటు కేసు, ప్రత్యేక ప్యాకేజీల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను మోదీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ధ్వజమెత్తారు. కురుపాంలో నిర్వహించిన నిరాహార దీక్ష శిబిరంలో ఆమె మాట్లాడుతూ చంద్రబాబు స్వార్ధ బుద్ధిని రాష్ట్రప్రజలు ఎప్పుడో గుర్తించారని తెలిపారు. హోదాకోసం నాలుగేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున్నది ఒక్క వైఎస్సార్‌సీపీయేనన్నారు. హోదా ఆవశ్యకతను జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించారని తెలిపా రు. ప్రజల్లో వ్యతిరేకతకు భయపడి హోదాపై చంద్రబాబు మాయపోరాటం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అనంతరం అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ ఢిల్లీలో రాజీనామా చేసిన ఎంపీలు చేపడుతున్న ఆమరణ దీక్షకు ఎన్నిరోజులైనా నియోజకవర్గ కేంద్రాల్లో రిలేదీక్షలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment