సాక్షి, వైఎస్సార్ కడప: రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యతిరేక విధానాలకు నిరసనలు వ్యక్తం చేశారు. ‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ మాజీ కార్పొరేటర్లు, కో అప్షన్ మెంబర్లు దీక్ష చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించిన ఈ దీక్షలు జిల్లాలోని అంబెద్కర్ కూడలి వద్ద కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మద్దతు తెలిపారు. పలువురు నేతలు, కార్యకర్తలు మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేస్తూ దీక్షకు సంఘీభావం తెలిపారు.
(పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష)
కడప: నగరంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు మూడు రాజధానులకు మద్దతుగా... భిక్షాటన, అర్థ నగ్న ప్రదర్శనతో నిరసన చేపట్టారు. ఈ నిరసన వైఎస్సార్‌సీపీ విద్యార్ధి విభాగం అధ్యక్షుడు ఖాజా రహంతుల్లా ఆధ్వర్యం జరిగింది. అదేవిధంగా బస్సులు, కార్ల అద్దాలు శుభ్రం చేస్తూ వినూత్న రీతిలో విద్యార్థులు తమ నిరసన తెలిపారు.
తూర్పు గోదావరి
పెద్దాపురం: మూడు రాజధానులకు మద్దతుగా కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు రిలే నిరాహారదీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు దవులూరి సుబ్బారావు, నెక్కంటి సాయి, ఆవాల లక్ష్మీ నారాయణ, కనకాల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. జిల్లాలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ముమ్మిడివరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రాజధానులకు కావాలని నాయుకులు నినాదాలు చేశారు. (వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి)
పిఠాపురం: అధికార వికేంద్రీకరణ కు మద్దతుగా వైఎస్సార్‌సీపీనేతలు రిలే దీక్షలు, వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వంహించారు. ఈ కార్యమాన్ని ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎల్లో మీడియా ఏదో జరుగుతుందని తప్పుడు సమాచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయారని అన్నారు. అమరావతిలో ఎటువంటి వసతులు లేకపోయినా అధికారులతో పని చేయించి కష్టపెట్టారని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన బాగుందంటే.. టీడీపీ మాత్రం సీఎం జగన్‌పై తప్పుగా మాట్లాడుతూ అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. (అభివృద్ధికి ఊతమివ్వండి)
తూర్పు గోదావరి: పరిపాలనా వికేంద్రీకరణకు మద్దతుగా రాజమండ్రి రూరల్ వైస్సార్‌సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ వైస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం: మూడు రాజధానులకు మద్దతుగా పదోరోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్ష కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. ఈయన ఈ దీక్షలో పాల్గొన్న నాయుకులకు ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ సంఘీభావం తెలిపారు.
గుంటూరు: వికేంద్రీకరణను అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరికి వైఎస్సారపీసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ముస్తఫా సహా పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, చైతన్య, కార్యకర్తల నిరసన చేట్టారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు బాపట్లలోని రథంబజార్ సెంటర్‌లో నిరసనదీక్ష చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజని ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేశారు.
కృష్ణా: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, ముత్తినేని విజయశేఖర్, చౌడవర పు జగదీష్, తుమ్మల ప్రభాకర్ మర్కపూడి గాంధీ, చిలుకూరు శ్రీనివాసరావు, పోతుమర్తీ స్వామి. రామ శెట్టి రామారావు, ప్రజలు, అభిమానులు పాల్లొన్నారు.
గాజువాక: విశాఖకు పరిపాలన రాజధాని కావాలంటూ పాతగాజువాక జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎమ్మేల్యే తిప్పల నాగిరెడ్డితోపాటు కార్యకర్తలు.. దేవన్ రెడ్డి, పల్లా చినతల్లి, ప్రగడ వేణుబాబు, రమణ, గోవింద, రోజారాణి పాల్గోన్నారు.
విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోరుతూ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి విభాగం నాయకుడు బి కాంతారావు ఆధ్వర్యంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి సంఘీభావం తెలిపారు. విశాఖ ఈస్ట్ కన్వీనర్ అక్రమాణి విజయనిర్మల, పార్టీ సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి, ప్రొఫెసర్ ప్రేమ నందం, మహిళా ప్రతినిధులు గరికిన గౌరీ, పీలా వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
విశాఖపట్నం: మూడు రాజధానులకు మద్దతుగా తగరపువలస జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ పట్టణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జగుపల్లి ప్రసాద్, రాంభుక్త ప్రభాకర్ నాయుడు, బంగి హరికిరణ్‌లో పాటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం: రాయదుర్గం పట్టణం వినాయక సర్కిల్‌లో మూడు రాజధానులకు మద్దతుగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు రిలే దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు.
తిరుపతి: అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఎస్వీయూలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాలు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వంటావార్పు కార్యక్రమం విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, యువజన విభాగాం నేత ఓబుల్‌రెడ్డి నేతృత్వంలో నిర్వహించారు.
శ్రీకాకుళం: జిల్లాలోని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ‘ మూడు రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం’ పై మేధావులు, కార్మికులు, రచయితలు, వ్యాపారులు పలు సంఘాలుతో చర్చా వేదిక జరిగింది. పెద్ద ఎత్తున కార్మికులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment