న్యాయవాదుల ఆమరణ దీక్ష విరమణ
తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయూలని కోరుతూ గత మూడు రోజులుగా జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు కొనసాగిస్తు న్న ఆమరణ నిరాహార దీక్షను శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ విరమింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. అంతకు ముందు కేటీఆర్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఎస్ఆర్ఎస్పీ సమీపంలో వాటర్‌గ్రిడ్ ఇన్‌టేక్ వెల్‌ను పరిశీలించారు.
ఆయన వెంట మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
తెలంగాణ హై కోర్టు కోసం న్యాయవాదుల ఆందోళన
⇒ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు
⇒ ఉదయం పూట నడవని ఆర్టీసీ బస్సులు
⇒ మూడో రోజు సాగిన నిరాహార దీక్షలు
⇒ క్షీణించిన ఆరోగ్యాలు
⇒ కాంగ్రెస్ పార్టీ బైక్ ర్యాలీ
⇒ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ క్రైం: తెలంగాణ ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నగర బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యా, వాణిజ్య, వ్యాపార సంస్థలను స్వచ్ఛందగా మూసివేశారు. తెరిచి ఉంచిన దుకాణాలను న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మూసివేయించారు. బస్సులు ఉదయం నడువలేదు. పెట్రోల్ బంక్‌లను సాయంత్ర వరకు మూసిఉంచారు. సినిమా హాళ్లలో ఉదయం ఆటను రద్దు చేశారు. న్యాయవాదులు ఉదయం ఆరుగంటల నుంచి డీసీఎం వ్యాన్‌లో జిల్లా కేంద్రంలో తిరుగుతూ బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బంద్ కారణంగా రద్దీగా ఉంటే గాంధీచౌక్, నెహ్రుపార్కు ప్రాంతాలు బోసి పోయాయి. న్యాయవాదులు ఉదయం బస్టాండ్‌కు చేరుకుని బస్టాండ్ ఎదుట బైఠాయించారు. దాంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయూరుు. బస్టాండ్ ఎదుట ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 10 గంటల తర్వాత బస్సులు నడిచారుు. ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక రోజు ముందుగానే సెలవు ప్రకటించారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, ఐకాస కన్వీనర్ ఎం రాజేందర్‌రెడ్డి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు డీసీఎం వ్యాన్‌లో నగరమంతా తిరుగుతూ బంద్ పాటించాలని ప్రజలను, వ్యాపారులను కోరారు. న్యాయవాదుల ఆందోళనకు మద్దతుగా న్యూడెమెక్రసీ, పీడీఎస్‌యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో న్యాయవాదులకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్‌భవన్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై దీక్ష శిబిరానికి చేరుకుంది. అక్కడి నుంచి నగరంలో తిరుగుతూ తెరిచి ఉం చిన దుకాణాలను మూసివేయించారు. ఈ బైక్ ర్యాలీలో మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్ పాల్గొన్నారు.
బీపీ తగ్గిన న్యాయవాదులు
న్యాయవాదులు చేపట్టిన నిరహార దీక్షలు మూడవ రోజుకు చేరుకోగా వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. దీక్ష శిబిరంలో ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇద్దరు న్యాయవాదులకు బీపీ తగ్గిపోతుండటంతో వైద్యులు తగు సూచనలు చేసి వెళ్తున్నారు. తెలంగాణ హై కోర్టు ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు దీక్షకు వీడబోమని న్యాయవాదులు పేర్కొంటున్నారు.
పలు జిల్లాల బార్ కౌన్సిల్ అధ్యక్షుల సంఘీభావం
నిజామాబాద్ న్యాయవాదులు చేస్తున్న దీక్ష శిబిరాన్ని ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి బార్ కౌన్సిల్ అధ్యక్షులు బిపిన్‌కుమార్, ప్రతాప్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, ఖమ్మం బార్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, జిల్లాలోని ఆర్మూర్, బిచ్కుంద బార్ కౌన్సిల్ సభ్యులు సందర్షించి సంఘీభావాన్ని తెలిపారు. తెలంగాణ హై కోర్టు కోసం వివిధ జిల్లాలో జరుగుతున్న ఉద్యమాలు, నిరసనలు సక్రమంగా జరుగటంలేదని, ఆంధ్ర జడ్జీలను బాయికాట్ చేయాలని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. హై కోర్టు కోసం మేం జిల్లాలో ఉద్యమిస్తుంటే, ఉమ్మడి హై కోర్టులో మీరేందుకు ఉద్యమించటంలేదని న్యాయవాదులు హై కోర్టు సాధన కమిటీ సభ్యులను ప్రశ్నించారు. దీనిపై వారు స్పందిస్తూ హై కోర్టు విధుల బహిష్కరణకు బార్ కౌన్సిల్ సభ్యులే ముందుండి నడిపించాలని అప్పుడే సక్సెస్ అవుతామని వారు సమాధానం ఇచ్చారు.
దీక్షల విరమణ
నిజామాబాద్ క్రైం: పంచాయతీ రాజ్ శాఖ, ఐటీ మంత్రి కె తారక రామారావు శనివారం రాత్రి న్యాయవాదుల దీక్షలను విరమింపజేరుుంచారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ న్యాయవాదుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ హై కోర్టు సాధించేవరకు కృషి చేస్తోందన్నారు. 41(ఏ) సెక్షన్‌తో పోలీస్స్టేషన్లలో జరుగుతున్న అవినీతి గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. హై కోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫైల్ చేసిందన్నారు. దీనిపై వచ్చే మంగళవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.
అనంతరం కేటీఆర్ న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్షల ను విరమింపచేశారు. కేటీఆర్ వెంట మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, జీవన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాత, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు తదితరులు ఉన్నారు.
విధులు బహిష్కరిస్తేనే హైకోర్టు వస్తుంది
నిజామాబాద్ క్రైం : ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరిస్తేనే తెలంగాణ హైకోర్టు ఏర్పడుతుందని సాధన కమిటీ కన్వీనర్ సహోదర్‌రెడ్డి అన్నారు. తక్షణమే విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో న్యాయవాదుల ఆమరణ నిరహార దీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల దీక్షలు తెలంగాణ జిల్లాలలో ప్రతి ఒక్క న్యాయవాదికీ ఆదర్శమన్నారు. తెలంగాణ హైకోర్టు కోసం గవర్నర్‌కు వినతిపత్ర ం సమర్పించామన్నారు. దానికి ఆయన స్పందించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రకు ప్రత్యేక హైకోర్టు కావాలని లెటర్ ఇస్తే తెలంగాణ హైకోర్టు ఏర్పా టుకు మార్గం సుగమమవుతుందని చెప్పారన్నారు.
సోమవారం చంద్రబాబును, కేసీఆర్‌ను కలువనున్నామన్నారు. హైకోర్టు ఏర్పడితే మన ఉద్యోగాలు మనకు వచ్చే అ వకాశాలు ఉంటాయన్నారు. హైకోర్టులో ఒక్క రోజు ఉద్యమం చేస్తే చాలని న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం. రాజేందర్‌రెడ్డి అన్నారు. వారం రోజులపాటు విధులు బ హిష్కరిస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. హైకోర్టు ఏర్పాటు కోసం కేంద్ర న్యాయశాఖ విభాగానికి లేఖ ఇచ్చామని, దానిని వారు సుప్రీంకోర్టుకు పంపారని చెప్పారు. ఈ నెల 24న ఏదో ఒకటి తేలిపోనుందన్నారు. తెలంగాణ హైకోర్టు ఏర్పాటు కోరుతూ న్యాయవాదులు ఇచ్చిన నిజామాబాద్ నగర బంద్ శనివారం ప్రశాంతం గా ముగిసింది.