శాంతియుత పోరాటం చేస్తాం | we will fight in gandhi way | Sakshi
Sakshi News home page

శాంతియుత పోరాటం చేస్తాం

Published Sun, Apr 16 2017 2:41 PM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM

శాంతియుత పోరాటం చేస్తాం

శాంతియుత పోరాటం చేస్తాం

నెల్లూరు(అర్బన్‌): తమ సమస్యల పరిష్కారానికి మహాత్మాగాంధీ పద్ధతుల్లో శాంతి యుతంగా దీర్ఘకాలిక పోరాటం చేస్తామని పలువురు మహిళా డాక్టర్లు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక పెద్దాస్పత్రి వద్ద డాక్టర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 31వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి చర్చలు జరపాలని తాము కోరితే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండటం దారుణమన్నారు. చర్చలకు ప్రభు త్వ పెద్దలు తప్పించుకుంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి డాక్టర్లతో వెంటనే చర్చలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీదేవి, శోభారాణి, పరంజ్యోతి, అపర్ణ, మీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement