సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని పరిరక్షించుకునే వరకు పోరా డతామని చట్ట పరిరక్షణ సమితి సోమవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని షెడ్యూల్–9లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సమితి ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంటు స్ట్రీట్ వద్ద చేపట్టి న రిలే నిరాహార దీక్షలు రెండవ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా సమితి చైర్మన్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. చట్టంలోని పాత నిబంధనల అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదించిన బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందే వరకు కేంద్రాన్ని విశ్వసించలేమన్నారు.
ఎన్నో బిల్లులు లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో నిలిచిపోయాయని గుర్తు చేశా రు. షెడ్యూల్–9లో చేర్చితేనే చట్టాన్ని పూర్తి స్థాయి భద్రత కల్పించినట్టవుతుందని, అప్పటిదాకా పోరాడతామని చెప్పారు. అంతకుముందు ఏపీలోని చుం డూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితుల ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించా రు. దీక్షలో సమితి కన్వీనర్లు అద్దంకి దయాకర్, జేబీ రాజు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment