
కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన బైక్‌లపై ర్యాలీగా బీరంగూడ కమాన్ దాటుతుండగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
సాక్షి, సంగారెడ్డి : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు ఆర్టీసీ కార్మికుల సమ్మె సెగ తగిలింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ పరిధిలోని రహదారి, రిజర్వాయర్ శంకుస్థాపనకు మంత్రి హరీశ్ ఆదివారం వచ్చారు. ఈనేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన బైక్‌లపై ర్యాలీగా బీరంగూడ కమాన్ దాటుతుండగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.