వేతన బకాయిల చెల్లింపుల కోసం తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ ఉద్యోగుల ఒక్క రోజు సమ్మె కొనసాగుతోంది.
వేతన బకాయిల చెల్లింపుల కోసం తెలంగాణ వ్యాప్తంగా గురువారం ఆర్టీసీ ఉద్యోగుల ఒక్క రోజు సమ్మె కొనసాగుతోంది. కొన్ని డిపోల పరిధిలో మాత్రమే ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రభావం 16 శాతం మాత్రమే కనిపిస్తోందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. మధ్యాహ్నానికి పూర్తి ప్రభావం ఉంటుందని చెప్పారు. సమ్మెలో దాదాపు 25వేల మంది కార్మికులు పాల్గొంటున్నారని వివరించారు.