సాక్షి, విజయవాడ : ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులు మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 13 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆర్టీసీ ఎండీ విదేశీ పర్యటన కారణంగా అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రధానంగా 18 డిమాండ్లను నెరవేర్చాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. చర్చలు విఫలమైతే తాము సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
కాగా, తమ పోరాటం ఆర్టీసీ యాజమాన్యం మీదే కానీ.. ప్రభుత్వంపైన కాదని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఆర్టీసీని ఆదుకుంటామని చెప్పి గత ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలే సమ్మెకు కారణమని, కార్మిక సంఘాలతో సంబంధాలు లేకుండా, గుర్తింపు సంఘంతో చర్చలు లేకుండా ఎండీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ఆదుకుంటారనే నమ్మకం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment