ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అక్టోబర్ 15లోగా పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేత దామోదర్ రావు తెలిపారు.
విజయవాడ : ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలను అక్టోబర్ 15లోగా పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేత దామోదర్ రావు తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడ పట్టణంలో ఆర్టీసీ ఎండీతో ఎంప్లాయిస్ యూనియన్ నేతలు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆర్టీసీలో నిర్వహించనున్న గుర్తింపు సంఘం ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని దామోదర్ రావు అన్నారు.