సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం ప్రగతిభవన్‌లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మను సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకార్మికుల భాగస్వా మ్యం ఉండేలా చూడాలని కోరారు.
డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలకల్లా కార్మికులను ప్రగతి భవన్‌కు తీసుకురావాలని, వారికి అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామ ని చెప్పారు.అనంతరం కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి చెందిన అన్ని విషయాలను కూలంకషంగా చర్చిస్తారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌తోపాటు, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ, ఈడీ లు, ఆర్‌ఎంలు, డీవీఎంలను ఆహ్వానించారు.
సీఎంకు రవాణా మంత్రి కృతజ్ఞతలు
ఆర్టీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో చేర్చుకోవడానికి అనుమతించిన సీఎం కేసీఆర్‌కు రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌లో శుక్రవా రం సీఎంను మంత్రి కలిశారు. ఆర్టీసీని కాపాడటానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చినందుకు, కార్మికులతో నేరుగా చర్చలు జరపాలని నిర్ణయించుకున్నందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment