
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను జేఏసీ పక్కన పెట్టిన నేపథ్యంలో వెంటనే చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్‌చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా తో మాట్లాడుతూ.. ప్రధాన డిమాండ్‌ను కార్మికులు పక్కన పెట్టినందున, హైకోర్టు సూచనలు గౌరవించి ప్రభుత్వం కూడా వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.