సాక్షి, అమరావతి: ‘వినే వాడుంటే చెప్పే వాడు ఎన్నయినా చెబుతాడు’ అన్నట్లుగా.. చదువుతున్నారు కదా అని పాఠకులంటే ఆ పత్రికకు అలుసు. నిత్యం అనేకానేక అబద్ధాలు రాసేస్తోంది. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెంచుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం అక్కసు వెళ్లగక్కుతోంది. అదే ధోరణిలో ఆర్టీసీపైనా అబద్ధాలు అచ్చేసింది. ‘అద్దె బస్సులతో ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల కోత అంటూ’ ఓ రోత కథనాన్ని సోమవారం ప్రచురించింది. ఈనాడు కథనం అవాస్తవమని అంశాలవారీగా తేల్చిచెబుతున్న ఫ్యాక్ట్ చెక్ ఇలా ఉంది..
1979 నుంచే అద్దె బస్సుల విధానం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అద్దె బస్సుల విధానంతో సంస్థ నిర్వీర్యమవుతోందని ఈనాడు చెప్పుకొచ్చింది. కానీ అద్దె బస్సుల విధానం ఆర్టీసీలో 1979 నుంచీ అమలులో ఉంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో కూడా అద్దె బస్సుల విధానం కొనసాగింది. అదేమీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది కాదు.
ఒక్క అద్దె బస్సూ పెరగ లేదు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీలో అద్దె బస్సులు పెరిగాయన్న ఈనాడు కథనం పూర్తిగా అవాస్తవం. ప్రస్తుత ప్రభుత్వం ఆరీ్టసీలో కొత్తగా ఒక్క అద్దె బస్సును కూడా తీసుకోలేదు. ప్రస్తుతం ఆర్టీసీలో 11,214 బస్సులు ఉండగా వాటిలో 2,360 మాత్రమే అద్దె బస్సులు. అంటే అద్దె బస్సులు 21 శాతమే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాకముందు కూడా 2,360 అద్దె బస్సులను ఆర్టీసీ నిర్వహించింది. గతంలో తీసుకున్న అద్దె బస్సుల కాల పరిమితి ముగియడంతో వాటి స్థానంలో అదే సంఖ్యలో కొత్త అద్దె బస్సులను టెండర్ల విధానంలో తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అద్దె బస్సుల సంఖ్యను పెంచనే లేదు.
కొనసాగుతున్న కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ
ఆర్టీసీ కొత్త బస్సులను కొనేందుకు ప్రభుత్వం అనుమతించలేదన్న ఈనాడు ఆరోపణ పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆర్టీసీ కొత్తగా 406 బస్సులను కొనుగోలు చేసింది. త్వరలో మరో వెయ్యి బస్సులు కొనేందుకు నిర్ణయించింది.
ఒక్క ఉద్యోగంలో కూడా కోత లేదు
వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఉద్యోగంలో కూడా కోత పడలేదు. ఇక ముందు కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గించే యోచన ప్రభుత్వానికి లేదు. పైగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. దాంతో 52 వేల మంది ఆర్టీసి ఉద్యోగులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. తద్వారా ఉద్యోగ భద్రతతోపాటు అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. సంస్థ లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచి నెలనెలా వారికి జీతాలు అందుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment