
ఆర్టీసీ కర్మికుల మెరుపు సమ్మె
హైదరాబాద్: తెలంగాణలోని పలు డిపోల‍్లో ఆర్టీసీ కార్మికులు శనివారం ఉదయం మెరుపు సమ్మెకు దిగారు. ఫలితంగా పలు డిపోల‍్లో నుంచి బస్సులు బయటికి రాలేదు. సూర్యాపేట, యాదగిరి గుట‍్ట ఆర్టీసీ డిపోల వద‍్ద కార్మికులు సమ్మెకు దిగారు. పెంచిన కిలోమీటర్లు తగ్గించాలని, ఎనిమిది గంటల పని విధానాన్ని అమలుచేయాలని అన్నారు. మోటారు వాహనాల చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలని, కార్మికులపై వేధింపులు మానివేయాలని వారు డిమాండ్ చేస‍్తున్నారు.