అనంతపురం: త్వరలో ఆర్టీసీలో జరగబోయే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దుర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 126 ఆర్టీసీ డిపోల్లో వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దుర్ యూనియన్ పోటీ చేస్తోందని చెప్పారు. సోమవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, అందుకే 900 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినా ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
'ఆర్టీసీలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం'
Published Mon, Jan 4 2016 6:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:05 PM
Advertisement
Advertisement