RTC elections
-
3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలను 3 నెలల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండేళ్లకోసారి జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కారర్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మికక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చింది. అంతకు ముందు 2016లో ఎన్నికలు జరిగాయని, 2018లో ఆ సంఘం కాల పరిమితి ముగిసిందని వెల్లడించింది. వెంటనే టీఎస్‌ఆరీ్టసీ సంఘం ఎన్నికలు నిర్వహించేలా సర్కార్‌ను ఆదేశించాలని ఎంప్లాయీస్ యూనియన్ నేత కె.రాజిరెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా.. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేశారు. చదవండి: విమాన ప్రయాణికులు @ 2.1కోట్లు -
తెలంగాణ ఆర్టీసీలో కొత్త లొల్లి
-
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై జాప్యం కొనసాగుతూనే ఉంది. గతవారం టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి టి.హరీశ్‌రావు రాజీనామా చేయడంతో మరోసారి ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు కూడా ముగియడంతో ఈ ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. గతేడాది ఆగస్టులోనే గుర్తింపు యూనియన్ టీఎంయూ పదవీకాలం ముగిసిందని.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని మిగతా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటు త్వరలోనే ఎన్నికలు ఉంటాయన్న అంచనాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిపోల్లోని తమ సంఘాల సభ్యులను ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని అప్రమత్తం చేస్తున్నాయి. ఆగస్టులోనే ముగిసిన గడువు.. గతేడాది ఆగస్టు 7తోనే తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) పదవీకాలం ముగిసింది. దీంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని నాగేశ్వరరావు (ఎన్ఎంయూ), రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ ముదిరాజ్ (టీజేఎంయూ) లేబర్ కమిషనర్‌కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయితే గతేడాది సెప్టెంబర్ 6న ప్రభుత్వం అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యమయ్యాయి. డిసెంబర్లో ఆ ఫలితాలు వచ్చాకైనా నిర్వహిస్తారని అనుకుంటే.. పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో మరోసారి ఆర్టీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే పంచాయతీ ఎన్నికలు ముగిసినా ఇంకా ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. అప్పట్నుంచి టీఎంయూదే హవా.. ఆర్టీసీలో 2012 నుంచి టీఎంయూ హవా కొనసాగుతోంది. 2012లో జరిగిన ఎన్నికల్లో టీఎంయూ పోటీ చేసి ఘన విజయం సాధించింది. 2013 జనవరిలో గుర్తింపు యూనియన్‌గా బాధ్యతలు స్వీకరించింది. 2015 జనవరిలో దాని పదవీకాలం ముగిసింది. తర్వాత 2016 జూలైలో ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు ఏడాదిన్నర ఆలస్యమైంది. అప్పటిదాకా టీఎంయూనే అధికారిక యూనియన్‌గా కొనసాగింది. 2016లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ టీఎంయూనే ఎన్నికైంది. 2018 ఆగస్టు 7తో ఈ పదవీకాలం ముగిసింది. హరీశ్ నిష్క్రమణతో స్పీడ్ పెంచిన యూనియన్లు టీఎంయూ గౌరవాధ్యక్షుడి పదవి నుంచి హరీశ్‌రావు తప్పుకోవడంతో.. మిగిలిన యూనియన్లు ఎన్నికలపై సీరియస్‌గా దృష్టి సారించాయి. మాజీ మంత్రి, ఉద్యమ నాయకుడి నిష్క్రమణతో ఈ సారి టీఎంయూకి తాము గట్టిపోటీ ఇస్తామని అంటున్నాయి. యూనియన్ల నేతలు రాష్ట్రవ్యాప్తంగా తమ అనుచరులకు ఎప్పటికçప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎçప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని సన్నద్ధం చేస్తున్నారు. మరోవైపు టీఎంయూ.. ఈసారీ తామే గెలిచేదని, హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. -
ఆర్టీసీలో ఎన్నికలు జాప్యం!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జాప్యం కానున్నాయా.. ఇప్పట్లో నిర్వహణ సాధ్యం కాదా? ప్రస్తుతం సంస్థలో జరుగుతున్న ప్రచారం ఇది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందస్తుకు తాము సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీలో ఎన్నికల నిర్వహణ కష్టమేనంటూ సీనియర్ యూనియన్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమవుతోందని, ఇదే నిజమైతే ప్రభుత్వం మిగిలిన విషయాలపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని పలువురు భావిస్తున్నారు. దీంతో ఆర్టీసీలో ఎన్నికలు జాప్యం కావచ్చొని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాప్యం సహజమే... ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికల్లో జాప్యం జరగడం కొత్తేం కాదు. 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించి 2013 జనవరిలో గుర్తింపు యూనియన్‌గా బాధ్యతలు స్వీకరించింది. ఈ లెక్కన 2015 జనవరితో ఈ యూనియన్ పదవీకాలం ముగియాలి. కానీ 2016 జూలై వరకు కొనసాగింది. ప్రస్తుతం టీఎంయూ పదవీకాలం 2018, ఆగస్టు 7 నాటికి ముగిసింది. నిబంధనల ప్రకారం కొత్త యూనియన్ ఎన్నికయ్యే వరకు పాత యూనియనే ఆపద్ధర్మంగా కొనసాగుతుంది. మరోవైపు ఏపీలోనూ గుర్తింపు యూనియన్ పదవీకాలం 2018 ఫిబ్రవరితో ముగిసినా ఈ ఆగస్టులో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు యూనియన్ల పట్టు.. ఎన్నికల్లో ఈసారి జాప్యాన్ని సహించేది లేదని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు పలు యూనియన్లు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈయూ, టీజేఎంయూలు లేబర్ కమిషనర్‌కు విన్నవించాయి. గుర్తింపు సంఘం పదవీకాలం ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో ఉన్న నేపథ్యంలో తమకు సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేముంటుందని ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణపై అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నాయి. -
ఆర్టీసీలో ఎన్నికల వేడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో విజయానికి యూనియన్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించాయి. కార్మికుల సంక్షేమం కోసం సాధించిన విజయాలను ప్రస్తుత గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) ప్రచారం చేసుకుంటోంది. ప్రస్తుత గుర్తింపు సంఘం హ యాంలో కార్మికుల సంక్షేమం కోసం చేపట్టిన చ ర్యలు శూన్యమని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) కార్మికులకు గుర్తు చేస్తోంది. ఈ దఫా కూడా తమ గుర్తింపును కాపాడుకోవాలని ఎన్ఎంయూ ప్రయత్నిస్తుండగా, ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలనే కసితో ఈయూ తీవ్రస్థాయిలో కృషి చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సా ర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించడంతో ఎన్నికల సమీకరణలు మారుతున్నా యి. ఇదిలా ఉండగా కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వంపై గుర్తింపు సంఘం ప్రభావం చూపలేకపోవడంతో రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయభేదాలు పొడసూపాయి. దీంతో ఎన్ఎం యూ రాష్ట్ర చైర్మన్‌ను సైతం దూరం చేసుకుంటోంది. సంఘాలెన్నో.. పోటీ రెండిటి మధ్యే రెండేళ్లకు ఒక సారి జరిగే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించి గుర్తింపు పొందగలిగితే రెండేళ్లపాటు ఆర్టీసీ యాజమాన్యం ఆ యూనియన్‌కు చర్చలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పిస్తుంది. దీనికోసం యూనియన్లు తీవ్రంగా పోటీపడుతుంటాయి. ఆర్టీసీలో కార్మిక సంఘాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎంఎంయూ, ఈయూ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, వైఎస్సార్ మజ్దూర్ సంఘ్, ఆర్టీసీ కార్మిక పరిషత్, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయాస్ యూనియన్‌తోపాటు మరికొన్ని చిన్న యూనియన్లు కార్మిక హక్కుల కోసం పనిచేస్తున్నాయి. ఎన్ని సంఘాలున్నా పోటీ మాత్రం ఎప్పుడూ ఎన్ఎంయూ, ఈయూ మధ్యే ఉంటోంది. గత ఎన్నికల్లో ఎన్ఎంయూ విజయం ఆర్టీసీలో రాష్ట్ర స్థాయి, రీజియన్ స్థాయి గుర్తింపు కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. 2016, ఫిబ్రవరి 18న జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్ఎంయూ 186 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్ఎంయూకు 1322 ఓట్లు పోలవగా ఎంప్లాయీస్ యూనియన్‌కు 1136 ఓట్లు వచ్చాయి. దీంతో రీజియన్ స్థాయితో పాటు రాష్ట్ర గుర్తింపు కూడా ఎన్ఎంయూ సొంతమైంది. కార్మికుల్లో విశ్వాసం కోల్పోతున్న ఎన్ఎంయూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాల్సిన గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కయ్యిందనే భావన కార్మికుల్లో బలంగా నాటుకుపోయింది. గన్నవరంలో సుమారు రూ.600 కోట్ల విలువైన 32 ఎకరాల ఆర్టీసీ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకుని హెచ్‌సీఎల్ సంస్థకు కట్టబెట్టడాన్ని ఎన్ఎంయూ కనీసం వ్యతిరేకించ లేదనే విమర్శను ఎదుర్కొంటోంది. అలాగే విజయవాడ గవర్నర్ పేట 1, 2 డిపోలకు చెందిన సుమారు తొమ్మిదిన్నర ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఇతరులకు కట్టబెట్టినా ఎన్ఎంయూ అడ్డగించలేదంటున్నారు. ఇదే కాక కార్మికుల జీతాల ఫిట్మెంట్ సాధించడంలో కూడా గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమయిందనే ఆగ్రహం కార్మికుల్లో కనిపిస్తోంది. గుర్తింపు సంఘంగా కార్మికుల హక్కుల సాధనలో, వారి సమస్యల పరిష్కారంలో ఎప్పటికప్పుడు విఫలమౌతూ ప్రభుత్వానికి తొత్తుగా ఎన్ఎంయూ వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేక ప్రశ్నిస్తున్న ఆ యూనియన్ రాష్ట్ర చైర్మన్ ఆర్‌వీవీఎస్‌డీ ప్రసాదరావును దూరం చేసుకోవడానికి యూనియన్ రాష్ట్ర నాయకత్వం వెనుకాడడం లేదు. ఆయనను యూనియన్ నుంచి తొలగించడానికి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. దీనికితోడు ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికల్లో తాము ఓడిపోతామనే భయంతోనే గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేయిస్తూ జూలై నెల వరకూ పొడిగించిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రకటన ఆశలు రేపింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని జగన్ చేసిన ప్రకటన కార్మికుల్లో ఆశలు రేపింది. సంస్థను నష్టాలబారి నుండి కాపాడాలంటే ఇంధనంపై పన్ను తగ్గించాలి. అన్ని కార్మిక సంఘాలు ఐక్య పోరాటం చేస్తేనే ఆర్టీసీ మనుగడను కాపాడుకోగలుగుతాం. ఎన్ఎంయూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయింది. ప్రభుత్వంతో కుమ్మక్కై కార్మికుల హక్కులను హరించివేసింది. – బొల్లినేని రాంబాబు, రీజనల్ కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ జగన్ ప్రకటనతో మారిన సమీకరణలు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించడంతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం వచ్చింది. తాము ఎంత కష్టపడుతున్నా సంస్థ నష్టాలను తమకు ఆపాదించడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కార్మికులకు జగన్ ప్రకటన ఊరటనిచ్చింది. దీంతో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉండే సంఘానికి మద్దతు పలికి గుర్తింపు ఎన్నికల్లో పట్టం కట్టడానికి కార్మికులు ఎదురు చూస్తున్నారు. -
ఆర్టీసీ హౌస్‌లో నామినేషన్లు దాఖలు
అమరావతి : ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల 16న జరుగుతున్న సీసీఎస్ (క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ) ఎన్నికలకు ఎంప్లాయిస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఉమ్మడి అభ్యర్ధులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్టీసీ హౌస్ (హెడ్ ఆఫీస్ యూనిట్)లో ఉన్న రెండు డెలిగేట్ల స్థానాలకు ఈయూ, ఎస్డబ్ల్యుఎఫ్ అభ్యర్ధులుగా ఎం.కృష్ణమూర్తి, కృష్ణమాచార్యులు తమ నామినేషన్లను ఆర్టీసీ పర్సనల్ ఆఫీసరు చిరంజీవికి అందజేశారు. ఈయూ రాష్ట్ర నాయకులు పి.దామోదరరావు, వైవీ రావు, ఎస్డబ్ల్యుఎఫ్ నాయకులు జిలానీలు ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. -
ప్రశాంతంగా ఆర్టీసీ ఎన్నికలు
మిర్యాలగూడ టౌన్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా నిర్వహించిన ఆర్టీసీ క్రెడిట్ కో- ఆపరేటీవ్ సొసైటీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్‌ను నిర్వహించారు. ఐదేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికలను టీఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ ఎన్ఎంయూ, బహుజన కార్మిక యూనియన్లు బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మిర్యాలగూడ డిపో నుంచి టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు. డిపోలో 445 మంది ఓటర్లకు గాను పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 434 ఓట్లు పోలయ్యాయి. కాగా ఆరు గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ను 9 రౌండ్లు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా డిపో మేనేజర్ సుధాకర్‌రావు వ్యవహరించారు. టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్ గెలుపు ఎన్నికల్లో టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 9 రౌండ్లు కౌంటింగ్ నిర్వహించగా ప్రతి రౌండ్లో టీఎంయూకు అధికంగా ఓట్లు రాగా, చివరి రెండు రౌండ్లలో ఎంప్లాయీస్ యూనియన్‌కు సానుకూలంగా ఓట్లు వచ్చాయి. అయితే 9వ రౌండ్లో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయి. టీఎంయూ బలపరిచిన జి. గోపయ్యగౌడ్కు 222, మండారి వెంకటేశ్వర్లుకు 200, ఎంప్లాయీస్ యూనియన్ అభ్యర్థి కేవీ రెడ్డికి 207, ఎన్ఎంయూ నుంచి చంద్రశేఖర్‌కు 128, ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి జాకబ్‌కు 24, రాములుకు 21 ఓట్లు వచ్చాయి. టీఎంయూ బలపరిచిన అభ్యర్థి జి.గోపయ్య, ఎంప్లాయీస్ యూ నియన్ నుంచి కేవీ రెడ్డి గెలుపొం దారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఆయా యూనియన్ల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నార్కట్‌పల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి ఆర్టీసీలో జరిగిన టీసీఎస్ ఎన్నికల్లో టీఎంయూ అభ్యర్థి ఐతరాజు వెంకన్నపై ఇండిపెండెంట్ అభ్యర్థి (టీఎంయూ) టీహెచ్ఎం. చారి 85 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డిపోలో 274 ఓట్లు ఉండగా 271 పోలయ్యాయి. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి టీహెచ్ఎం. చారికి 165 ఓట్లు, టీఎంయూ అభ్యర్థి ఐతరాజు వెంకన్నకు 80 ఓట్లు, మిత్రపక్షాల అభ్యర్థి పాపయ్యకు 26 ఓట్లు లభించాయి. మూడు ఓట్లు చెల్లలేదు. -
జట్టు కట్టినా దక్కని విజయం
గుర్తింపు ఎన్నికల్లో రెండో స్థానంలో ఈయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఒకే డిపోలో రెండో స్థానానికి పరిమితమైన ఎన్ఎంయూ మిగతా డిపోల్లో వంద లోపే ఓట్లు హన్మకొండ : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఐక్య కూటమిగా ఏర్పడిన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్‌డబ్ల్యూఫ్) విజయాన్ని అందుకోలేక పోయింది. టీఎంయూ వేగాన్ని అందుకోలేక.. బాణం తాకిడి తట్టుకోలేక ఇతర యూనియన్లు కకావికలమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్‌తో జత కట్టిన ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపు కోసం జరిగిన పోటీలో రీజియన్‌లో మెజారిటీ సాధించింది. అప్పటి వరకు సుదీర్ఘకాలం గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న ఎన్ఎంయూకూ పోటీగా ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ జతకట్టాయి. అయితే, ఆ ఎన్నికల్లో ఈయూ రాష్ట్ర గుర్తింపు సాధించగా, టీఎంయూ రీజియన్ గుర్తింపు సాధించింది. ఇక ఎన్ఎంయూ ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ ఎన్నికల్లో రీజియన్‌లోని ఎనిమిది డిపోల్లో జనగామ, మహబూబాబాద్‌లో ఎన్ఎంయూ మెజారిటీ ఓట్లు సాధించగా మిగతా ఆరు డిపోల్లో ఈయూ, టీఎంయూ కూటమి మెజారిటీ ఓట్లు సాధించింది. 2012లో వరంగల్ రీజియన్‌లో 4,355 ఓట్లు ఉండగా 4,256 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర గుర్తింపు కోసం పోటీ చేసిన ఎంప్లాయీస్ యూనియన్ 2,460 ఓట్లు సాధించింది. ఇక తాజాగా మంగళవారం జరిగిన ఎన్నికలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గుర్తింపుకు పోటీ పడి 1,395 ఓట్లు మాత్రమే సాధించి రెండో స్థానానికి పరిమితమైంది. 2012 ఎన్నికల్లో రీజియన్ గుర్తింపుకు పోటీ పడిన టీఎంయూ 2,541 ఓట్లు సాధించగా.. ప్రస్తుత ఎన్నికలో టీఎంయూ రీజియన్ గుర్తింపు(క్లాస్–6)నకు 2,405 ఓట్లు, రాష్ట్ర గుర్తింపు(క్లాస్–3)నకు 2,397 ఓట్లు సాధించింది. గత ఎన్నికలతో చూస్తే స్వల్పంగా ఓట్లు తగ్గినా సగానికి పైగా ఓట్లు సాధించి గుర్తింపు సాధించడం విశేషం. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికల్లోనూ ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్ఎంయూ ప్రస్తుత ఎన్నికల్లో కనీస ప్రభావం చూపకపోవడం గమనార్హం. జిల్లాలోని తొమ్మిది డిపోల్లో ఒక్క జనగామలోనే రెండో స్థానంలో నిలవగా మిగతా డిపోలో వంద లోపు ఓట్లు మాత్రమే పడ్డాయి. 2012లో జరిగిన ఎన్నికల్లో క్లాస్–3లో 1,538 ఓట్లు సాధించిన ఎన్ఎంయూ ఈ ఎన్నికల్లో కేవలం 413 ఓట్లు మాత్రమే సాధించింది. క్లాస్–6లో గత ఎన్నికల్లో 1,425 ఓట్లు సాధించిన ఎన్ఎంయూ ఈ ఎన్నికల్లో 435 ఓట్లతో సంతృప్తి పడింది. ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రస్తుత ఎన్నికల్లో క్లాస్–6కు పోటీ పడి 1,305 ఓట్లు సాధించి ద్వితీయ స్థానానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో ఈ యూనియన్ క్లాస్–3లో 223, క్లాస్–6లో 229 ఓట్లు సాధించింది. ఐక్యకూటమిగా ఏర్పడి ఓట్లు శాతాన్ని పెంచుకుందే తప్ప గుర్తింపునకు నోచుకోలేదు. ఈ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన బహుజన కార్మిక యూనియన్ క్లాస్–3లో 12 ఓట్లు, క్లాస్–6లో 19 ఓట్లతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంయూ వరంగల్ రీజియన్‌లోని తొమ్మిది డిపోలు, ఆర్ఎం కార్యాలయంలో సగానికి పైగా ఓట్లు సాధించి అన్ని డిపోలో తన ఆధిక్యాన్ని నిలుపుకుంది. ఐక్యకూటమి తొమ్మిది డిపోల్లోని ఎనిమిది డిపోల్లో ద్వితీయ స్థానంలో నిలవగా ఎన్ఎంయూ కేవలం జనగామ డిపోలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. క్రాస్ ఓటింగ్... ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు ఫలితాల వెల్లడయ్యాక పలువురు చెబుతున్నారు. నాయకుల ఒత్తిడి మేరకు కొంత మంది కార్మికులు తమ రెండు ఓట్లలో ఒక్కో ఓటు ఒక్కో యూనియన్‌కు వేశారు. ఈ ఎన్నికల్లో అగ్ర భాగాన నిలిచిన తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు సైతం క్రాస్ ఓటింగ్ తప్పలేదు. రాష్ట్ర గుర్తింపు క్లాస్–3కు 2,397 ఓట్లు రాగా, రీజియన్ గుర్తింపు క్లాస్–6కు 2,405 ఓట్లు పడడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. రీజియన్ గుర్తింపును సమర్థించిన ఎనిమిది మంది ఓటర్లు రాష్ట్ర గుర్తింపునకు టీఎంయూను వ్యతిరేకించినట్లు భావించాల్సి వస్తోంది. ఐక్య కూటమిగా పోటీ చేసిన ఈయూ, ఎస్డబ్లు్యఎఫ్లకు పడిన ఓట్లలోను తేడా కనిపించింది. క్లాస్–3కి ఫోటీ చేసిన ఈయూకు 1,395 ఓట్లు రాగా, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు 1,305 ఓట్లు వచ్చాయి. అంటే క్లాస్–3కి పోటీ చేసిన ఈయూకు, క్లాస్–6కు పోటీ చేసిన ఎస్‌డబ్ల్యూఎఫ్ కంటే 90 ఓట్లు అధికంగా వచ్చాయి. ఇక ఎన్ఎంయూకు క్లాస్–3లో 413 ఓట్లు రాగా, క్లాస్–6లో 435 ఓట్లు.. అంటే 22 ఓట్లు అధికంగా వచ్చాయి. వరంగల్ రీజియన్‌లో ఎప్పుడూ కనిపించని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు క్లాస్–6లో 30 ఓట్లు వచ్చాయి. అయితే, ఐక్యకూటమిగా పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ క్లాస్–6కు పోటీ చేసింది. ఈ రెండు సంఘాల పేర్ల నడుమ సామీప్యత ఉండడం వల్లే స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్‌కు పడాల్సిన ఓట్లు స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు పడినట్లు భావిస్తున్నారు. ఈ ఓట్లు కూడా క్లాస్–3కి కాకుండా ఒక్క క్లాస్–6లోనే పడడంతో వీరి భావనకు బలం చేకూరుస్తోంది. -
టీఎంయూ జయకేతనం
ఐదు డిపోల్లో గెలుపు ఒక్క డిపోలో ఈయూ విజయం జిల్లాలో మంగళవారం ఆర్టీసీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి.. నిజామాబాద్ రీజియన్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హవా కొనసాగింది.. జిల్లాలో ఆరు డిపోలు ఉండగా.. ఐదింటిలో టీఎంయూ.. ఒక్క డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) విజయం సాధించాయి.. నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ.. నిజామాబాద్ డిపో-2లో మాత్రం ఈయూ విజయకేతనం ఎగురవేసింది.. ఈ సందర్భంగా కార్మికులు బాణాసంచా కాల్చుతూ.. రంగులు చల్లుకుంటూ విజయోత్సాహం నిర్వహించారు.. నిజామాబాద్‌నాగారం : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) సత్తా చాటింది. జిల్లాలో ఆరింటిలో ఐదు డిపోల్లో జయకేతనం ఎగురవేసింది. ఒకదాంట్లో ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది. నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్‌లో 6 డిపోలు ఉన్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. రీజియన్ పరిధిలోని ఆరు డిపోల్లో 3,064 ఓట్లుండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం 97గా నమోదైంది. టీఎంయూ, ఈయూల మధ్యే ప్రధాన పోటీ సాగింది. కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఆయా సంఘాలు చర్యలు తీసుకున్నాయి. అనారోగ్యంతో ఉన్న కార్మికులను ఆటోలు, జీపులు, బైక్‌లపై పోలీంగ్ కేంద్రాలకు తరలించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించారు. ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేశారు. నిజామాబాద్ డిపో-1, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్‌లలో టీఎంయూ గెలుపొందింది. నిజామాబాద్ -2 డిపోలో మాత్రం ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) గెలిచింది. రీజియన్‌లో 3,064 ఓట్లు ఉండగా 3,002 ఓట్లు పోలయ్యాయి. టీఎంయూ 1,733 ఓట్లు సాధించి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. బాన్సువాడ డిపోలో ఒక ఓటు విషయంలో రీకౌంటింగ్ నిర్వహించారు. మిగతా అన్ని డిపోల్లో అంతా ప్రశాంతంగా లెక్కింపు పూర్తి అయ్యింది. క్లాస్-3 రాష్ట్రానికి సంబంధించి పూర్తి మెజారిటీ సాధించింది. రీజీయన్ స్థాయి క్లాస్-6లో డిపో-2లో తప్ప మిగిలిన అన్ని స్థానాల్లో టీఎంయూ గెలిచింది. 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్.. దూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడానికి వెళ్లిన మిగతా 62 మంది కార్మికులు తమ ఓటు హక్కును ఈ నెల 25, 26 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ పద్ధతిన వినియోగించుకోవచ్చునని డిప్యూటీ లేబర్ కమిషనర్ చతుర్వేది తెలిపారు. వీరి ఓట్లను లెక్కించి సీల్డ్ కవర్లో రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని పేర్కొన్నారు. వాటి వివరాలను వచ్చేనెల 8న ప్రకటిస్తారన్నారు. డిపోల్లో సంబురాలు.. అన్ని డిపోల్లో కార్మికుల సంబురాలు అంబరాన్నింటాయి. ఐదు డిపోల్లో టీఎంయూ, ఒక డిపోలో ఈయూ సంబురాలు చేసుకున్నాయి. పెద్ద ఎత్తున టపాసులు కాల్చారు. -
టీఎంయూ రయ్.. రయ్
ఆర్టీసీ ఎన్నికల్లో జయభేరి ఏడు డిపోల్లోనూ విజయబావుటా గల్లంతైన ప్రధాన ప్రతిపక్షాలు సిట్టింగ్ స్థానం కోల్పోయిన ఎన్ఎంయూ సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం కోసం నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) అన్ని డిపోల్లో ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లకు డిపాజిట్లు దక్కలేదు. జిల్లాలోని ఏడు డిపోల్లోనూ టీఎం యూ విజయకేతనం ఎగురవేసింది. మూడేళ్ల క్రితం సంగారెడ్డి డిపోలో క్లాస్–6లో గెలుపొందిన ఎన్ఎంయూ ఈసారి చేజార్చుకుంది. మొత్తంగా నా రాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సిద్దిపేట, మెద క్, సంగారెడ్డి డిపోల్లో టీఎంయూకు ఎ దురే లేకపోయింది. క్లాస్–3లో మా త్రం అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ఫలితాలు వెల్లడికాలేదు. ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌తో జతకట్టి పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) టీఎంయూపై ప్రభావం చూపలేకపోయింది. టీఎంయూ రీజన ల్ కన్వీనర్ పీరయ్య మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లే ఈసారీ కార్మికులు తమకే పట్టం కట్టారన్నారు. టీఎంయూను గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా టీఎంయూ భారీ మెజారిటీతో గెలుపొందడంతో కార్మికులు, యూనియన్ నాయకులు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ప్రశాంతంగా పోలింగ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక గు ర్తింపు సంఘం కోసం మంగళవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు డి పోల్‌లో 2,792 మంది ఓటర్లు ఉండగా, 2,714 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరో 78 మంది ఓ ట్లు వేయలేదు. విధి నిర్వహణలో ఉ న్నవారు ఈ నెల 23 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని డిప్యూటీ లేబర్ కమిషనర్ కోటేశ్వర రావు తెలిపారు. కార్మిక శాఖాధికారు లు జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో 24 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రీజనల్ మేనేజర్ వేణు సంగారెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. డిపోల వారీగా.. సిద్దిపేట డిపోలో టీఎంయూ అత్యధిక ఓట్లను కైవసంచేసుకుంది. సా యంత్రం 6.30 నుంచి డిపో ఆవరణలో ఓట్ల లెక్కింపును నిర్వహించా రు. రాత్రి 8కి ఫలితాలను వెలువరించారు. టీఎంయూకు 250, ఈ యూకు 113, ఎన్ఎంయూకు 46, బీఎంఎస్‌కు 42, బీకేఎస్కు 12 ఓట్లు లభించాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపోలో టీఎం యూకు 190 ఓట్లు దక్కాయి. ఇం కా బీకేయూ 8, ఈయూ 53, టీఎన్‌ఎంయూ 54 దక్కించుకున్నాయి. నారాయణఖేడ్ డిపోలో టీఎం యూ క్లాస్–3, క్లాస్–6లో సమాన ఓట్ల (203)ను సాధించింది. బీ ఎంఎస్, ఈయూ, ఎన్‌ఎంయూలు క్లాస్–6లో జేఏసీగా ఏర్పడి ఐక్యం గా పోటీచేయడంతో ఈ కూటమికి 104 ఓట్లు లభించాయి. దుబ్బాకలో టీఎంయూకు 123 ఓ ట్లు రాగా ఈయూకు 48, ఎన్ఎం యూకు 7, బహుజన కార్మిక యూ నియన్‌కు 1, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్–1, కార్మిక సంఘానికి 1 ఓటు వచ్చాయి. జహీరాబాద్‌లో టీఎంయూ 279 ఓట్లు దక్కించుకోగా, ఈయూకు 151 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు వి షయంలో తేడా రావడంతో డిపో వద్ద ఈయూ ఆం దోళనకు దిగింది. ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు. బీహెచ్ఈఎల్ డిపోలో టీఎంయూ 521 ఓట్లతో గెలుపొందింది. మెదక్ డిపోలో టీఎంయూ 339 ఓట్లతో ఘన విజయం సాధించిం ది. జిల్లా వ్యాప్త ఎన్నికల్లో టీఎం యూ 339, క్లాస్6 (రాష్ట్రవ్యాప్తం గా) 333 ఓట్లు సాధించింది. -
ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూ ముందంజ
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ హవా కొనసాగుతోంది.తెలంగాణలో మంగళవారం జరిగిన ఆర్టీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఎంయూ దూసుకుపోతోంది. చాలాచోట్ల టీఎంయూ విజయం సాధించింది. నల్గొండ జిల్లా కోదాడ, సూర్యాపేట, దేవరకొం,యాదగిరిగుట్టలో టీఎ౦యూ విజయం సాధించింది. దీంతో టీఎంయూ కార్మిక సంఘాలు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా తెలంగాణ వచ్చాక ఆర్టీసీ తొలి కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని బస్ డిపోలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆర్టీసీ వర్క్‌షాపులలో పోలింగ్ కొనసాగింది. సాయంత్రం ఆరున్నరకు కౌంటింగ్ మొదలైంది. ఫలితాలను మాత్రం ఈనెల 25, 26 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా కలిపి వచ్చేనెల 8న అధికారికంగా విడుదల చేస్తారు. అయితే అనధికారికంగా మంగళవారం రాత్రికే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈసారి పది సంఘాలు బరిలో ఉండగా తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 49,600 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. *వికారాబాద్, దుబ్బాకలో టీఎంయూ విజయం. * బస్ భవన్ టీఎంయూ విజయం * కరీంనగర్ నాన్ ఆపరేషన్ జోన్ ...టీఎంయూ విజయం *నాన్ ఆపరేషన్ హెడ్ ఆఫీస్ జోన్ టీఎంయూ గెలుపు *మంథని,మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్, గజ్వేల్, దుబ్బాకలో టీఎంయూ విజయం సాధించింది. -
ఆర్టీసీ ఎన్నికలు నేడే
నిజామాబాద్ నాగారం : ఆర్టీసీలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలో 3,064 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే ప్రచార ఘట్టం పరిసమాప్తమైంది. గత వారం రోజుల నుంచి ముమ్మరంగా ప్రచారం నిర్వహించిన యూనియన్ల నేతలు.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. రెండు యూనియన్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాత్రి 7 తర్వాత ఫలితాలు.. నిజామాబాద్ డిపో–1, 2, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ డిపోలలో పోలింగ్ ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించున్నారు. రాష్ట్రానికి, రీజియన్‌కు సంబంధించి ప్రతి కార్మికుడు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రతి డిపోకు ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ అధికారులను కేటాయించారు. వారంతా వెంటనే విధుల్లోకి చేరాలని లేబర్ కమిషనర్ ఆదేశించారు. ముఖ్య నేతల ప్రచారం కలిసొచ్చేనా..? ఎన్నికల్లో గెలుపు కోసం ఈయూ, టీఎంయూ ముఖ్య నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. వారి ప్రచారం ఓటర్లపై ఎంత మేరకు ప్రభావం చూపనుందనేది చర్చనీయాంశంగా మారింది. ఈయూ రాష్ట్ర నేతలు రాజిరెడ్డి, బాబు జిల్లాలోని అన్ని డిపోల్లో పర్యటించారు. మరోవైపు టీఎంయూ కీలక నేతలు తిరుపతయ్య, అశ్వద్ధామరెడ్డి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించి, ఓట్లేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో రెండు యూనియన్లు ప్రత్యర్థులపై భారీగా విమర్శలు గుప్పించాయి. పెండింగ్ బకాయిలు సహా వివిధ అంశాలపై జోరుగా ప్రచారం చేశాయి. ఈయూకు ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ అండ.. ఈయూకు ఎస్‌డబ్ల్యూఎఫ్ మొదటి నుంచి మద్దతుగా నిలుస్తుండగా, తాము కూడా అండగా ఉంటామని నేషనల్ మజ్దూర్ యూనియన్ రెండ్రోజుల క్రితం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయూకు కలిసొచ్చే అవకాశముంది. కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ డిపో–1లలో కచ్చితంగా గెలుస్తామని ఆ యూనియన్ నేతలు చెబుతున్నారు. ఇక ఆర్మూర్‌లో గట్టి పోటీనిస్తామని, బాన్సువాడలో మాత్రం పరిస్థితి ప్రతికూలంగా ఉందని భావిస్తున్నారు. మొత్తంగా రీజియన్‌లో మాత్రం గెలుపు తమదేనని చెబుతున్నారు. ఒంటిరిగానే టీఎంయూ.. తెలంగాణ మజ్దూర్ యూనియన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. మిగతా యూనియన్ల కంటే తమకే ఎక్కువ మంది ఓటర్లు మద్దతు ఉందని, నిజామాబాద్ డిపో–1, 2, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్‌లో కచ్చితంగా గెలుస్తామని నేతలు ధీమాగా చెబుతున్నారు. బాన్సువాడలో ఇప్పటికే గెలుపు ఖాయమైందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇక్కడ వస్తుందని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీ టీఆర్ఎస్ నేతల ప్రోత్సాహం టీఎంయూకు ఎంతో బలంగా మారింది. సెల్ఫోన్లు తీసుకురావొద్దు.. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఓటర్లు సెల్ఫోన్లు తీసుకొని పోలింగ్ కేంద్రాలకు రావొద్దు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఐడీ కార్డు తీసుకొని రావాలి. పోలింగ్ ముగిసిన రెండు, మూడు గంటల్లో ఫలితాలు వెల్లడిస్తాం. – చతుర్వేది, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ -
ఆర్టీసీ ఎన్నికల్లో టీఎంయూను బలపర్చాలి
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ నారాయణఖేడ్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అమోఘమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ అన్నారు. నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో ఆవరణలో టీఎంయూ యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికులు టీఎంయూను బలపర్చాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు టీఎంయూ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారని, టీఎంయూను గెలిపించి ఆయనకు కానుకగా ఇవ్వాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. సమావేశంలో ఆర్టీసీ రీజియనల్ కార్యదర్శి పి.శ్రీనివాస్‌రెడ్డి, బాబర్ మియా, డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ రెడ్డి, నెహ్రూ, అజీం, మహీంద్రా యూనియన్ టీఎంఎస్ అధ్యక్షుడు మదన్మోహన్, సర్పంచ్ అప్పారావు షెట్కార్, గొర్రెలకాపరుల సహకార సంఘం జిల్లా చైర్మన్ మల్శెట్టి యాదవ్, జెడ్పీటీసీలు నిరంజన్, రవి, టీఆర్ఎస్ నాయకులు పండరి యాదవ్, మూఢ రామకృష్ణ, పురంజన్, బాసిత్, వెంకట్‌నాయక్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు. -
వాడివేడిగా నారాయణఖేడ్‌లో ‘ఆర్టీసీ’ ఎలక్షన్స్
ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం గుర్తింపు కోసం తలపడుతున్న యూనియన్లు నారాయణఖేడ్: ఆర్టీసీలో జరుగుతున్న గుర్తింపు ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిపో ఆవరణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 19న పోలింగ్ జరగనున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌ఎంయూదే ఆధిపత్యం నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో 1987వ సంవత్సరంలో ఆవిర్భవించింది. డిపో ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ)నే ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1991లో ఒకసారి భారతీయ మజ్దూర్‌సంఘ్(బీఎంఎస్) గెలుపొందింది. ఇదిలా ఉండగా, గత ఏడాది ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) గెలిచింది. టీఎంయూ ఏర్పాటు అనంతరం ఎన్ఎంయూ భారీగా పతనమైంది. ఎన్‌ఎంయూలో చాలామంది నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరడంతో ఆ యూనియన్ బలపడింది. ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టీఎంయూ ప్రయత్నిస్తుండగా.. ఆ యూనియన్ను మట్టికరిపించాలని మిగతావారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిపోలో 327 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. గట్టిపోటీ ఇవ్వనున్న టీఎంయూ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి గుర్తింపునకు క్టాస్–3కు తెలుపురంగు ఓటరు స్లిప్పుపై, రీజినల్æస్థాయిలో గుర్తింపునకు క్లాస్–6 పింక్‌కార్డు ఓటరు స్లిప్పుపై ఓటేయాల్సి ఉంది. రీజియన్ స్థాయిలో గెలిచిన యూనియన్ అధికారికంగా స్థానిక డిపోల్లో అధికారిక యూనియన్‌గా చలామణి అవుతుంది. నారాయణఖేడ్ డిపోలో టీఎంయూ మాత్రమే స్వతహాగా క్లాస్–3, క్లాస్–6కు పోటీ చేస్తోంది. కాగా, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), బీఎంఎస్, ఎన్ఎంయూ యూనియనుల్లు జేఏసీగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు యూనియన్లు రీజియన్ స్థాయిలో క్లాస్–6కు ఐక్యంగా పోటీలో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో క్లాస్–3కి మాత్రం విడివిడిగా పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే టీఎంయూతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతయ్య, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్.. యూనియన్ తరపున బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందున కార్మికులంతా టీఎంయూకు ఓటేసి గెలిపించాలని, తమ సమస్యల పరిష్కారానికి టీఎంయూ మాత్రమే ప్రత్యామ్నాయమని హామీలిచ్చారు. కాగా, బీఎంఎస్ నుంచి రీజియన్ కార్యదర్శి మెట్టు రాఘవులు, ఎంప్లాయీస్ యూనియన్ నుంచి జిల్లా కార్యదర్శి కాన్షీరాం, ఎన్ఎంయూ జిల్లా అధ్యక్షుడు రాములు ప్రచారాన్ని నిర్వహించారు. టీఎంయూ నాయకులు కార్మికుల వద్ద ముడుపులు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. -
ఓటడిగే హక్కు వైఎస్సార్ మజ్దూర్‌కే ఉంది
అధికారంలోకి రాగానేఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి యూనియన్ను బలపరచాలి వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి విజయవాడ (గాంధీనగర్) : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఓటడిగే హక్కు వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌కు మాత్రమే ఉందని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న జరగనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో వైఎస్సార్ యూనియన్‌కు కార్మిక శాఖ టేబుల్ ఫ్యాన్‌ను ఎన్నికల గుర్తుగా కేటాయించిందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క సంతకంతో 9,600 మంది కార్మికులను పర్మినెంట్ చేశారన్నారు. ఆర్టీసీ పరిరక్షణకు రూ. 250 కోట్లు కేటాయించి ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని రిలయన్స్‌కు, ఎంపీ కేశినేని శ్రీనివాస్‌కు ఇచ్చేందుకు కుతంత్రాలు చేస్తోందన్నారు. విద్యాధరపురంలోని ఆర్టీసీ స్థలాన్ని బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం పేరుతో కార్మికుల వేతనాల్లోంచే రూ.100 వసూలు చేసిన పాపం చంద్రబాబుదేనన్నారు. కార్మికుల సంక్షేమం కోసం.. కార్మికుల సంక్షేమం కోసం సత్వరమే చేయాల్సిన తొమ్మిది కార్యక్రమాలను నవరత్నాల పేరిట అమలు చేయాలని వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ నిర్ణయించిందని గౌతంరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే హామీతో తమ యూనియన్ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి చెప్పి, సింగిల్ డ్రైవర్ విధానాన్ని రద్దు చేస్తామన్నారు. డ్రైవర్‌కు కండక్టర్ బాధ్యతలు తప్పిం చటం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సౌకర్యాలు కల్పించటా నికి వైఎస్సార్ మజ్దూర్ యూనియన్ సిద్ధమైందని వివరించారు. టేబుల్ ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను బలపరచాలని కోరారు. యూనియన్ రీజియన్ కార్యదర్శి డీవీఎస్ బాల సుబ్రహ్మణ్యం, ఎన్నికల కన్వీనర్ పి.రవికాంత్, కె.అరుణ్‌కుమార్, జీకే బాబు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్
- ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితా.. -18న పోలింగ్, కౌంటింగ్ - మార్చి 4న అధికారికంగా ఫలితాలు వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. తెల్ల రంగు బ్యాలెట్(క్లాజ్ 3) రాష్ట గుర్తింపునకు, గులాబి రంగు బ్యాలెట్(క్లాజ్ 6) జిల్లా గుర్తింపునకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13జిల్లాల్లోను ప్రస్తుతం ఉన్న 57,800ఓటర్లకు సంబంధించిన జాబితాలను ఈ నెల 29న అన్ని డిపోల్లోను ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు దానికి సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 6వ తేదీన అభ్యంతరాల పరిశీలన చేస్తారు. బదిలీలు, పదవి విరమణ, వృతులకు సంబంధించిన ఓట్లను తొలగింపులు, చేర్పులు, మార్పులు చేసి ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితాలను ఆర్టీసీ డిపోల వారీగా ప్రకటిస్తారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఎన్నికల సిబ్బందికి, సామాగ్రి చేరవేతకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. ఆయా డిపోల పరిధిలోని డిపో మేనేజర్లు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18న ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు డిపోలవారీగా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 23, 24తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌ను అందజేయవచ్చు. ఆ రెండు రోజుల్లోను ఏ రోజు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను అదే రోజు లెక్కిస్తారు. పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపుతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం ఏమిటన్నది తేలిపోనుంది. అయితే మార్చి 4 ఉదయం 11గంటలకు గుర్తింపు సంఘం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. -
'ఆర్టీసీలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం'
అనంతపురం: త్వరలో ఆర్టీసీలో జరగబోయే ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని వైఎస్సార్ ఆర్టీసీ మజ్దుర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. 126 ఆర్టీసీ డిపోల్లో వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దుర్ యూనియన్ పోటీ చేస్తోందని చెప్పారు. సోమవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని, అందుకే 900 బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చినా ఒక్క రూపాయి కూడా వేతనం పెరగలేదని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు.