మెదక్: టీఎంయూ సంబరాలు
- ఆర్టీసీ ఎన్నికల్లో జయభేరి
- ఏడు డిపోల్లోనూ విజయబావుటా
- గల్లంతైన ప్రధాన ప్రతిపక్షాలు
- సిట్టింగ్ స్థానం కోల్పోయిన ఎన్‌ఎంయూ
- గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపోలో టీఎం యూకు 190 ఓట్లు దక్కాయి. ఇం కా బీకేయూ 8, ఈయూ 53, టీఎన్‌ఎంయూ 54 దక్కించుకున్నాయి.
- నారాయణఖేడ్ డిపోలో టీఎం యూ క్లాస్–3, క్లాస్–6లో సమాన ఓట్ల (203)ను సాధించింది. బీ ఎంఎస్, ఈయూ, ఎన్‌ఎంయూలు క్లాస్–6లో జేఏసీగా ఏర్పడి ఐక్యం గా పోటీచేయడంతో ఈ కూటమికి 104 ఓట్లు లభించాయి.
- దుబ్బాకలో టీఎంయూకు 123 ఓ ట్లు రాగా ఈయూకు 48, ఎన్‌ఎం యూకు 7, బహుజన కార్మిక యూ నియన్‌కు 1, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్–1, కార్మిక సంఘానికి 1 ఓటు వచ్చాయి.
- జహీరాబాద్‌లో టీఎంయూ 279 ఓట్లు దక్కించుకోగా, ఈయూకు 151 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు వి షయంలో తేడా రావడంతో డిపో వద్ద ఈయూ ఆం దోళనకు దిగింది. ఫలితాన్ని ఇంకా ప్రకటించలేదు.
- బీహెచ్‌ఈఎల్ డిపోలో టీఎంయూ 521 ఓట్లతో గెలుపొందింది.
- మెదక్ డిపోలో టీఎంయూ 339 ఓట్లతో ఘన విజయం సాధించిం ది. జిల్లా వ్యాప్త ఎన్నికల్లో టీఎం యూ 339, క్లాస్6 (రాష్ట్రవ్యాప్తం గా) 333 ఓట్లు సాధించింది.
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర రవాణా సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం కోసం నిర్వహించిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అనుబంధ కార్మిక సంఘమైన టీఎంయూ (తెలంగాణ మజ్దూర్ యూనియన్) అన్ని డిపోల్లో ఘన విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్ష కార్మిక సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్లకు డిపాజిట్లు దక్కలేదు.
జిల్లాలోని ఏడు డిపోల్లోనూ టీఎం యూ విజయకేతనం ఎగురవేసింది. మూడేళ్ల క్రితం సంగారెడ్డి డిపోలో క్లాస్–6లో గెలుపొందిన ఎన్‌ఎంయూ ఈసారి చేజార్చుకుంది. మొత్తంగా నా రాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్– ప్రజ్ఞాపూర్, దుబ్బాక, సిద్దిపేట, మెద క్, సంగారెడ్డి డిపోల్లో టీఎంయూకు ఎ దురే లేకపోయింది. క్లాస్–3లో మా త్రం అర్థరాత్రి వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుండడంతో ఫలితాలు వెల్లడికాలేదు.
ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌తో జతకట్టి పోటీ చేసిన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) టీఎంయూపై ప్రభావం చూపలేకపోయింది. టీఎంయూ రీజన ల్ కన్వీనర్ పీరయ్య మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్లే ఈసారీ కార్మికులు తమకే పట్టం కట్టారన్నారు.
టీఎంయూను గెలిపించిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా టీఎంయూ భారీ మెజారిటీతో గెలుపొందడంతో కార్మికులు, యూనియన్ నాయకులు పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందాన్ని పంచుకున్నారు.
ప్రశాంతంగా పోలింగ్
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మిక గు ర్తింపు సంఘం కోసం మంగళవారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు డి పోల్లో 2,792 మంది ఓటర్లు ఉండగా, 2,714 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మరో 78 మంది ఓ ట్లు వేయలేదు. విధి నిర్వహణలో ఉ న్నవారు ఈ నెల 23 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని డిప్యూటీ లేబర్ కమిషనర్ కోటేశ్వర రావు తెలిపారు. కార్మిక శాఖాధికారు లు జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోల్లో 24 మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రీజనల్ మేనేజర్ వేణు సంగారెడ్డి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.
డిపోల వారీగా..
సిద్దిపేట డిపోలో టీఎంయూ అత్యధిక ఓట్లను కైవసంచేసుకుంది. సా యంత్రం 6.30 నుంచి డిపో ఆవరణలో ఓట్ల లెక్కింపును నిర్వహించా రు. రాత్రి 8కి ఫలితాలను వెలువరించారు. టీఎంయూకు 250, ఈ యూకు 113, ఎన్‌ఎంయూకు 46, బీఎంఎస్‌కు 42, బీకేఎస్‌కు 12 ఓట్లు లభించాయి.