సాక్షి ఎక్స్‌క్లూజివ్, హైదరాబాద్ : భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, టెలినార్ ఇండియాల విలీనం సోమవారం (నేడు) పూర్తికానుంది. ఈ మేరకు కేంద్ర టెలికాం శాఖ అనుమతి ఇచ్చింది. విలీనం అనంతరం 1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో మొత్తం 43.4 మెగాహెట్జ్ స్పెక్ట్రం ఎయిర్‌టెల్ పరంకానుంది.
దీనిపై ఇరు టెలికాం కంపెనీలు మధ్యాహ్నం మూడు గంటలకు అధికారికంగా ప్రకటన చేయనున్నాయి. ఏడు సర్కిళ్లు ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలలో టెలినార్ సేవలందిస్తోంది. మార్చి 8న నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ ఈ విలీనానికి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment